భారతదేశం పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక చక్కని నమూనా!

Latest Posts

05/07/2025

2025 జూలై 9 దేశవ్యాప్త సమ్మె డిమాండ్లు

G. Ashok

 

2025 జూలై 9 దేశవ్యాప్త సమ్మె డిమాండ్ల

1.     నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.

2.    పని హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. సమాన పనికి - సమాన వేతనం అమలు చేయాలి. కనీస వేతనం నెలకు రూ.26,000/- లుగా నిర్ణయించాలి.

3.    ఔట్ సోర్స్, ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్ మెంట్, అప్రెంటిస్లు, ట్రైనీలు వంటి రూపాలలో వివిధ పథకాల క్రింద పనిచేస్తున్న కార్మికులు ఎవరినీ క్యాజువలైస్ చేయరాదు.

4.    ఈపిఎస్ మరియు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ విరమణ చేసిన వారందరికి కనీస పెన్షన్ నెలకు రు. 13,000లు ఇవ్వాలి. దానికి ఎప్పటికప్పుడు కరువు భత్యం జోడించాలి.  అసంఘటిత కార్మికులు మరియు వ్యవసాయ కార్మికులతో సహా అన్ని తరగతుల కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. పెన్షన్తో సహా సమగ్ర సామాజిక భద్రతలో అందరినీ భాగస్వాములను చేయాలి.

5.    పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలి. సిఎన్ఎస్ మరియు యుపిఎస్ ను రద్దు చేయాలి. పెన్షన్ సవరణ చట్టం 2025ని రద్దు చేయాలి.

6.    ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పటికే వర్తిస్తున్న ఆరోగ్య సదుపాయాలను కుదించకుండా అవసరమైన మేరకు మెరుగ్గా చేయాలి.

7.     దరఖాస్తు పెట్టినప్పటి నుండి 45 రోజుల వ్యవధిలో కార్మిక సంఘాల తప్పనిసరి రిజిస్టర్ చేయబడాలి. ILO సమావేశాలు C87 మరియు C98 లను తక్షణమే ఆమోదించాలి.

8.    ధరల పెరుగుదలను నియంత్రించాలి. ఆహారం, మందులు, వ్యవసాయ- పనిముట్లు, ఎరువులు మరియు యంత్రాలు వంటి ముఖ్యమైన వస్తువులపై జీఎస్టీని తొలగించాలి. పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాస్ పై సెంట్రల్ ఎక్సైజ్ పన్నును గణనీయంగా తగ్గించాలి. ఆహార భద్రత చట్టానికి హామీ ఇవ్వాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి.

9.    ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాల ప్రైవేటీకరణను ఆపాలి. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ (MP) ను వెనక్కితీసుకోవాలి.

10. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర @C-2+50% నిర్ధారించాలి. చట్టపరమైన హామీ ఇవ్వాలి. విత్తనం, ఎరువులు మరియు విద్యుత్ మొదలైన వాటిపై రైతులకు ఇన్పుట్ సబ్సిడీని పెంచాలి.

11.  విద్యుత్ (సవరణ) బిల్లు 2022ను ఉపసంహరించుకోవాలి. విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలి. ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు.

12. ఉచిత విద్యా హక్కు, ఉచిత ఆరోగ్య హక్కు, నీరు మరియు అందరికీ పారిశుధ్యం అందుబాటులోకి తేవాలి. నూతన విద్యా విధానం (NEP) 2020ను రద్దు చేయాలి. అందరికీ గృహనిర్మాణం అమలు చేయాలి.

13. అటవీ హక్కుల చట్టాన్ని (FRA) కఠినంగా అమలు చేయాలి.

14. వెల్ఫేర్ ఫండ్ లోకి వచ్చిన చందా నిధులతో నిర్మాణ కార్మికులకు ESI కవరేజ్ ఇవ్వాలి. ఆరోగ్య పథకాలకు కవరేజ్, ప్రసూతి ప్రయోజనం, ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న కార్మికులందరికీ జీవిత మరియు వైకల్యం బీమా ఇవ్వాలి.

15. అత్యధిక సంపన్నుల పైన, కార్పొరేట్లపైన విధిస్తున్న పన్నును పెంచాలి. సంపద పన్ను మరియు వారసత్వ పన్నును తిరిగి ప్రవేశపెట్టాలి.

16.      భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి హక్కు, మత స్వేచ్ఛ, విభిన్న సంస్కృతులు, భాషలు, చట్టం ముందు సమానత్వం మరియు దేశ సమాఖ్య నిర్మాణం మొదలైన రాజ్యాంగ ప్రాధమిక విలువలైన దాడిని ఆపాలి.

జి. అశోక్ 9490300725

04/07/2025

కార్మికులకు మరణశాసనం లేబర్‌కోడ్స్‌

G. Ashok

                                         కార్మికులకు మరణశాసనం లేబర్‌కోడ్స్‌


1991లో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మికుల వ్యతిరేక వైఖరి, ప్రయివేటీకరణ పోకడల్ని నిరసిస్తూ, కార్మిక హక్కుల్ని కాపాడటం కోసం పది కేంద్ర కార్మిక సంఘాలు నాటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా 21 సమ్మెలు నిర్వహించాయి. ప్రధాన రంగాల ప్రయివేటీకరణ, విదేశీ పెట్టుబడి ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తూ మొదటి దేశవ్యాప్త సమ్మె 29 నవంబర్‌ 1991లో మొదలైంది. కార్మికులకు అధిక వేతనాలు, సామాజిక భద్రత కల్పించడం, కార్మిక చట్టాల్లో సంస్క రణలకు వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాప్త సమ్మెల్లో కార్మికులు ప్రతియేటా పాల్గొంటు న్నారు.


అంతేకాక ఉద్యోగ భద్రత, పెన్షన్‌ హక్కును డిమాండ్‌ చేస్తూ కార్మికులు సమ్మెలు నిర్వహిస్తున్నారు. 2020 నవంబర్‌ 26న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో 25 కోట్ల మంది అనగా 250 మిలియన్ల కార్మికులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె ద్వారా తమ నిరసన తెలియజేశారు. ఇది ప్రపంచంలో జరిగిన అతిపెద్ద సమ్మెల్లో ఒకటని జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు అభివర్ణించాయి. 2019 జనవరి 8-9 తేదీల్లో జరిగిన రెండు రోజుల సమ్మె, 2022 మార్చి 28-29 తేదీల్లో జరిగిన సమ్మెలు, బ్యాంకింగ్‌, రవాణా, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభావితం చేశాయి. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక కార్మికుల హక్కుల కోసం పోరాడే శక్తివంతమైన వేదికగా నిలుస్తున్నది. జులై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె కూడా అందులో భాగం కానుంది.



ప్రస్తుతం మోడీ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసత్వంలోకి నెట్టి వేసే లక్ష్యంతో 29 కార్మిక చట్టాల్ని రద్దు చేసి, వాటిస్థానంలో నాలుగు లేబర్‌ కోడ్స్‌ను అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నది. ఫ్యాక్టరీల్లో, పని ప్రదేశంలో యూనియన్లు లేకుండా చేయటమే లక్ష్యంగా, కార్మికవర్గాన్ని నిరాయుధుల్ని చేయడమే ధ్యేయంగా ఈ లేబర్‌ కోడ్స్‌ అని స్పష్టమవుతున్నది. 2002లో అప్పటి వాజ్‌పారు ప్రభుత్వం 2వ లేబర్‌ కమిషన్‌ను రవీంద్రవర్మ నేతృత్వంలో నియమించి 44 కార్మిక చట్టాల స్థానంలో లేబర్‌ కోడ్స్‌ను తీసుకురావాలని ప్రతిపాదించింది. ప్రస్తుత మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, చట్టవిరుద్ధ విధానాలు దాదాపు అన్ని కూడా 2వ లేబర్‌ కమిషన్‌ సిఫార్సులను పోలి ఉండటాన్ని గమనిస్తే అప్పటినుండి యజమానులకు అనుకూలంగా, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయ పూనుకున్నదన్న విషయం అవగతమవుతున్నది.


2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వామపక్ష పార్టీల సహకారం ఉండటం వల్లన లేబర్‌కోడ్స్‌ను తీసుకురావడానికి వెనుకడుగు వేసింది. 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తీసుకొచ్చి వాటి ప్రక్రియను ప్రారంభించింది. కార్మిక సంఘాల సమ్మెలు, పోరాటాల వలన వెంటనే అమలు చేయడానికి ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. 2019లో మూడోసారి అధి కారం చేపట్టిన తర్వాత పార్లమెంట్‌లో వేతనాల కోడ్‌ను పాస్‌ చేయించుకుంది. 2020లో మిగిలిన మూడు పారిశ్రామిక సంబం ధాల కోడ్‌, సామాజిక భద్రత కోడ్‌, వత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్స్‌ను ఆమోదించుకుంది. మూడు వ్యవ సాయ నల్లచట్టాలు పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్‌ సభ్యులు వాటికి నిరసనగా వాకౌట్‌ చేసిన సమయంలో ఈ లేబర్‌ కోడ్స్‌ను దొడ్దిదారిలో ఆమోదింపజేసుకుంది.



ఈ లేబర్‌కోడ్స్‌ను సరిగ్గా పరిశీలిస్తే కార్మిక వర్గంపై ప్రత్యక్ష దాడిచేసి వారి హక్కుల్ని హరించేందుకు ఉద్దేశించిన విధంగా ఇవి రూపొందించబడ్డాయి. దేశ సహజ వనరులను, ప్రజలను దోచుకోవడానికి, కార్పొరేట్‌ యాజమా న్యాలకు లాభాలు కట్టబెట్టడానికి, కార్మికులను మరింత దోపిడీ చేసేలా ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కార్మికులు, సంఘాలు కార్మికులతో కలిసి నిరంతర పోరాటాలు, ఆందోళనలు, ప్రతిఘటనలు చేయడం వల్ల ఈ నాలుగేండ్ల నుంచి ఈ లేబర్‌కోడ్స్‌ని అమలు చేయటంలో కేంద్రం కాస్తా వెనుక్కు తగ్గింది. అయితే 2025లో ఈ లేబర్‌ కోడ్స్‌ను ఎలాగైనా అమలు చేయలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ”జన విశ్వాస్‌” అనే చట్టంలోని నిబంధనల ప్రకారం అనేక చట్టాల కింద కార్పొరేట్లకు సంబంధించి 180 నేరాలను నేరరహితం చేసింది. ఈ చట్టాలను ఉల్లంఘించినందుకు యజమానులకు జైలు శిక్షలు విధించే నిబంధనలను ఈ లేబర్‌ కోడ్స్‌లో ఉపసంహరించింది. 2025 కేంద్ర బడ్జెట్‌లో కూడా మరో 100 నేరాలను నేర రహితం చేసింది. ”శ్రమ సమాధాన్‌”, ”శ్రమ సువిధ పోర్టల్‌”లు యజమానులు కార్మిక చట్ట ఉల్లంఘనలను సులభతరం చేయడానికి, ఫిర్యాదు ఆధారిత తనిఖీలను ఈ లేబర్‌ కోడ్స్‌ ద్వారా రద్దు చేసింది.



మరోవైపు కార్మికులు పోరాడి సంపాదించు కున్న హక్కులను కాలరాస్తూ సమిష్టి బేరసారాల చర్యలను లేబర్‌కోడ్స్‌ తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నది. కార్మికులు వారి సంఘాలు సమిష్టిగా ఫిర్యాదు చేయడం లాంటి వాటిని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని పేర్కొంటు న్నది. ఫలితంగా నాన్‌ బెయిలబుల్‌ శిక్షలతో సహా పోలీసు చర్యలకు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. ఈ లేబర్‌ కోడ్స్‌ అమలు చేయడానికి ముందుగానే గేట్‌ మీటింగులు, డిపార్ట్‌మెంటల్‌ సమావేశాలు, కరపత్రాల పంపిణీ, మెమొరాం డాలు అందజేయటం లాంటి ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాలను, హక్కులను ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థల్లో ఇప్పటికే నిషేధించింది. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఉపాధిని తీసుకురావడం ద్వారా ఉద్యోగ భద్రతతో పాటు అనేక సౌకర్యాలు అందచేయకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది. శాశ్వత ఉద్యోగి, ఉపాధి అనేది ఒకప్పటి విషయం.


ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్‌, అప్రెంటీస్‌లు, ఇంటర్న్‌షిప్‌లు మొదలైన విధానాల ద్వారా కార్మికులను కేంద్రం నియమిస్తున్నది. అంతేకాక ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ సౌకర్యాలను కూడా కార్మికులకు దూరం చేసే రూల్స్‌ను ఈ లేబర్‌కోడ్స్‌లో పొందుపరిచింది. ఇది ట్రేడ్‌ యూనియన్‌లను బలహీనపరచడానికి, యూనియన్లను తొలగించడానికే అనేది స్పష్టమవుతున్నది.దీనిద్వారా కార్మికుల్లో ఒక భయానక వాతావరణాన్ని సష్టించే పథకం చాపకింద నీరులా మోడీ సర్కార్‌ అనుసరిస్తున్నది.

లేబర్‌ కోడ్స్‌ అమలు అంటే మొత్తం పరిపాలనలో కార్పొరేట్‌ పెట్టుబడిదారీ వర్గం విధానాల అమలుకు ఎలాంటి అడ్డం కులు లేకుండా కొనసాగించుకోవడానికి, యథేచ్ఛగా లాభాలు ఆర్జించటానికేనన్నది స్పష్టమవుతున్నది. యూనియన్ల రహిత పని ప్రదేశాల ఏర్పాటు, కార్మికుల సమిష్టి చర్యలను నిర్వీర్యం చేసి వారిని నిరాయుధులను చేయడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది.



కార్మికుల హక్కుల్ని కాలరాసే మరణ శాసనాలుగా ఈ లేబర్‌కోడ్స్‌ పనిచేయ నున్నవి. అందుకే ఈనెల 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను గతంలో నిర్వహించిన సమ్మెల్లో ఒకటిగా చూడకూడదు. లేబర్‌ కోడ్స్‌ అమలును తీవ్రంగా తిప్పికొట్టడానికి ప్రతిఘటనా, పోరాటాల ప్రారం భంగా ఈ సమ్మెను చూడాలి. పెట్టుబడి దారీ విధానాన్ని తరిమేయడంలో కార్మిక వర్గం మరింత మెలకువతో ముందుండాలి. నయా ఉదార వాదానికి వ్యతిరేకంగా, ఐక్యపోరాటాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకుని వెళ్లాలి. ఈ సమ్మె రెండవ దశ పోరాటానికి ప్రారంభం మాత్రమేనని దేశ ప్రజానీకానికి తెలియజేయాలి.



****

ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్‌ 9490300867


16/01/2025

ఇంటర్ విద్యలో సంస్కరణల అవసరం..

G. Ashok

 

ఇంటర్ విద్యలో సంస్కరణల అవసరం..


                        

ఇంటర్ విద్యలో సంస్కరణల అవసరం



        జాతీయ క్రైమ్ బ్యురో లెక్కల ప్రకారం భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల్లో 9శాతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. వీటిలో మెజారిటీ విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్నావారే కావడం గమనార్హం. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు 2022 ప్రకారం విద్యార్థుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరుసగా 10, 11వ స్థానాల్లో ఉన్నాయి.

             తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు అధికశాతం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇంటర్మీడియట్ విద్యారంగం కార్పొరేట్ శక్తుల కబంధహస్తాల్లో ఉండడమే. వారి ప్రభావం మూలంగా గత మూడు దశాబ్దాలలో ఇంటర్మీడియట్ విద్యలో ఎటువంటి సంస్కరణలు జరగలేదు. కార్పొరేట్ శక్తుల స్వార్థ ప్రయోజనాలకోసం పోటీ ప్రపంచంలో తామంలే తాము ముందున్నామని ప్రజలను నమ్మించడం కోసం విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. 

విద్యలో మౌలిక వ్యత్యాసాలు

            తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి వరకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) విధానం, ఆంధ్రప్రదేశ్ లో సిబిఎస్ఈ పరీక్షల విధానం అమలులో ఉన్నాయి. పదో తరగతి సిలబస్, ఇంటర్ మీడియట్ సిలబస్ మధ్య చాలా వైవిధ్యత ఉంటుంది. పదో తరగతి బోర్టు పరీక్షలలో ప్రశ్నీ పత్రం విధానానికీ, ఇంటర్మీడియట్ పరీక్ష పత్రం విధానానికి కూడా మౌళికంగా చాలా తేడాలు ఉన్నవి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ఆగష్టులో పూర్తి అవుతాయి. పరీక్షలు మార్చి మొదటి వారంలో ఉంటాయి. విద్యార్థి కేవలం 6 నెలల్లో పరీక్షలకు సిద్దం అయి బోర్డు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

మొదటి సంవత్సరం విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి

      కొన్ని సందర్భాలలో విద్యార్థులు మొదటగా ఒక గ్రూపు ఎంపిక చేసుకుని, తరువాత వివిధ కారణాల వలన వేరే గ్రూపుకు మారుతుంటారు. అలాంటి విద్యార్థులకు మరింత తక్కువ సమయమే దొరుకుతుంది. ఈ విధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు చాలా ఒత్తిడితో పరీక్షలకు హాజరు అవుతున్నారు. దీని ప్రభావంతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉంటుంది. అలాంటి విద్యార్తులు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులూ, రెండవ సంవత్సరం సబ్జెక్టులు కలిపి పరీక్షలకు ఒకేసారి హాజరు కావడం వల్ల రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆత్మహత్యలకు గురి అవుతున్న విద్యార్థులలో అత్యధిక శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇంటర్ ఫలితాలు వెలువడిన ప్రతిసీరి విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఇంటర్మీడియట్ లో చేరే విద్యార్థులు కోర్సు మొదలయిన రోజునుండి ఫలితాలు వచ్చేవరకు రెండు సంవత్సరాలపాటు నిరంతర ఒత్తిడిలో ఉంటారు. దీనికి కారణం బోర్డు పరీక్షలు, కార్పొరేట్ శక్తుల మరియు తల్లిదండ్రుల ఒత్తిడి.

మొదటి సంవత్పరం పరీక్ష తొలగింపే మంచిది

    దేశంలో కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో మాత్రమే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కేవలం అంతర్గత మూల్యాంకనం ద్వారా మాత్రమే విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను నమోదు చేస్తున్నారు. ఇంటర్మీడిట్ మొదటి సంవత్సరం పరీక్షల్ని తొలగిస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గి మొదటి ఏడాది సిలబస్ లో కీలక అంశాలపై పట్టు సాధించడంతోపాటు వాటి ఆధారంగా రెండో ఏడాది సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు జాతీయ స్థాయి పరీక్షలలో రాణించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే సమయం, సౌలభ్యం దొరుకుతుంది. అధ్యాపకులు కూడా పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు వెసులు బాటు ఉంటుంది. అదేవిధంగా జాతీయ బోర్డు మరియు ఇతర రాష్ట్రాల బోర్డులు కేవలం 12వ తరగతి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నందున వారితో సారూప్యత ఏర్పడుతుంది. ఇక్కడ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు తొలగిస్తే విద్యార్థులు, అధ్యాపకులలో మొదటి సంవత్సరంపై శ్రద్ధ తగ్గి కేవటం రెండవ సంవత్సరంలపై మాత్రమే ద్రుష్టి పెడతారని కొందరు విద్యావేత్తల అభిప్రాయం. మొదటి సంవత్సరం ఇంటర్నల్ పరీక్షలు, మూల్యాంకనం పకడ్బంధీగా నిర్వహించడం ద్వారా దీనిని అధిగమించవచ్చు.

అభ్యసన సామర్థ్యాల మెరుగుదల అప్పుడే

  విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గడం ద్వారా వారి అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరగాయని పరిశోధనల ద్వారా రుజువయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బోర్డు పరీక్షలను రద్దుచేసి అంతర్గత మూల్యాంకనం ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని నమోదు చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా భయరహితంగా పరీక్షలు సిద్ధం అవుతారు. విద్యార్థుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంది. పోటీ పరీక్ష మాయజాలంలో పడి మధ్యతరగతి తల్లిదండ్రులు వారి ఆర్థిక స్థోమత కన్నా ఎక్కువగా అప్పులు చేసి వారి పిల్లలను కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నారు. పిల్లలపై ఒత్తిడి పెరగడానికి అలా తల్లిదండ్రలు కూడా కారణమవుతున్నారు.

ప్రభుత్వ కోచింగ్ సెంటర్లు ఆవశ్యకత

    ప్రభుత్వమే ఇంటర్మీడియట్ తరువాత విద్యార్థులు రాసే పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా కోచింగ్ కేంద్రాలను నిర్వహించడం ప్రభుత్వ రంగంలో ఇంటర్మీడియట్ విద్య బలోపేతానికి చర్యలు తీసుకోవడం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇంటర్మీడియట్ విద్యలో అలాంటి సంస్కరణలు చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలను రద్దు అంశంపై ప్రతిపాదనలు చేయడం ద్వారా చర్యలు ప్రారంభించిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలు సంస్కరణలు చేయడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తాయని ఆత్మహత్యలు నివారించడానికి క్రుషి చేస్తాయని ఆశిద్దాం.


Dr. A. Venu Gopala Reddy

Pakala Sankar Goud 



12/09/2023

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-వాస్తవాలు-వక్రీకరణలు

G. Ashok

 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-వాస్తవాలు-వక్రీకరణలు



తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 11 సెప్టెంబర్‌ 1946 నుండి 21 అక్టోబర్‌ 1951 వరకు ఐదు సంవత్సరాల నెల రోజుల పాటు సాగింది. సుశిక్షితులైన నిజాం సేనలకు, భారత సేనలకు, జమిందారీ ప్రయివేట్‌ సైన్యంతోపాటు రజాకార్ల సైన్యాలకు వ్యతిరేకంగా వ్యవసాయం చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు సాగించిన చారిత్రక పోరాటం. ఈ పోరాటానికి ప్రపంచ ఖ్యాతి లభించింది. పోరాట సందర్భంగా ఉనికిలోలేని పార్టీలు, నాయకులు నేడు ఈ పోరాటాన్ని వక్రీకరిస్తూ తమ పాత్రను అందులో జోడించు కుంటున్నారు. విముక్తి, విద్రోహం, విమోచన అంటూ వక్రీకరణలు చేస్తున్నారు. ముస్లింల నుండి హిందువులు విముక్తి పొందారని కొందరు, పోరాటాన్ని విరమించడం ద్వారా విద్రోహం జరిగిందని కొందరు, బంధనాల నుండి విమోచనం పొందామని కొందరు టన్నుల కొద్దీ వక్రీకరణలు చేస్తూ, ఆత్మానందం పొందుతున్నారు. వాస్తవ పోరాట వారసులను చిన్నచూపు చూస్తున్నారు.

వాస్తవంగా జరిగిందేమిటి?
230 సంవత్సరాల అసప్‌జాహిల పాలనలో నాటి తెలంగాణలోని ప్రజలు అనేక భాదలు పడ్డారు. హిందూ, ముస్లిం ప్రజలను హిందూ జమీందార్లు, ముస్లిం రాజులు, రజాకార్లు కలిసి ప్రజలపై భౌతిక దాడులు, ఆర్థిక దాడులు చేశారు. 10వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ 1911లో అధికారానికి వచ్చి 1948 సెప్టెంబర్‌ 17న రైతాంగ సాయుధ పోరాటంతో పదవీచ్యుతుడైనాడు. ఈ నిజాం కాలంలోనే మరాఠాలతో జరిగిన యుద్ధంలో అంగ్లేయుల సహకారం పొందినందుకు వారికి మచీలిపట్నం నుండి గుంటూరు వరకు గల ప్రాంతాన్ని ధారాదత్తం చేశాడు. ఆ తరువాత బ్రిటిష్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమ నాలుగు జిల్లాలను దత్త మండలాలుగా ఇచ్చివేశాడు. మిగిలిన 16 జిల్లాలతో నిజాం ప్రభుత్వం కొనసాగింది. ఇందులో 5 జిల్లాలు మహారాష్ట్రకు చెందినవికాగా, 3 జిల్లాలు కర్నాటకకు చెందినవి. 5.30 కోట్ల ఎకరాలలో రైతులకు 3కోట్ల ఎకరాలకు పట్టాలివ్వగా, 1.5 కోట్ల ఎకరాలు జమీందార్ల స్వాధీనంలో, 55 లక్షల ఎకరాలు నిజాం స్వంత అస్తి (సర్పెఖాస్‌)గా ఉన్నాయి. గ్రామాలలో విపరీతమైన వెట్టిచాకిరి కొనసాగింది. జమీందార్లకు తాము పండించిన పంటలతోపాటు గొర్రెలు, మేకలు, కోళ్లు, తేనె ఉచితంగా ఇచ్చేవారు. చివరికి వారి అడపిల్లలను జమీందార్ల కుటుంబాలకు ‘అడబాప’లుగా పంపించాలి. పండిన పంట మొత్తం అమ్ముకున్నప్పటికీ శిస్తులకు కావాల్సిన ఆదాయం వచ్చేది కాదు. జమీందారు భూములను, నిజాం భూములను మొదట సాగు చేసిన తరువాతనే రైతులు తమ భూములు సాగు చేసుకోవాలి. శిస్తు వసూళ్ళలలో తీవ్ర నిర్భంధం, హింస కొనసాగేది. ఈ పరిస్థితులలో ప్రజలు అనేక గ్రామాలలో తిరుగుబాట్లు చేశారు.


రష్యాలో కమ్యూనిస్టుల ప్రభుత్వం… తెలంగాణపై ప్రభావం
1914లో రష్యాలో కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడింది. దాని ప్రభావం తెలంగాణ ప్రజలపై పడింది. 40శాతం తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నప్పటికీ ఉర్ధూ, మరాఠి మాత్రమే మాట్లాడేవారు. చదువు కోవడానికి పాఠశాలలు లేవు. శిస్తులు చెల్లించనందుకు ‘ఖారజ్‌ఖాత’ పేరుతో భూములు ప్రభుత్వానికి ఇచ్చి కూలీలుగా పనిచేసేవారు. తెలుగుభాష విస్తరణ కోసం ఆంధ్ర జన సంఘం పేరుతో కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన గ్రంధాలయ సంస్థను ఏర్పాటు చేశారు. వీటికి ప్రతి ఏటా కమిటీని ఎన్నుకునేవారు. వామపక్ష భావాలు కలిగిన రావి నారాయణరెడ్డి 11వ ”ఆంధ్ర జనసంఘం” వార్షికోత్సవ ఎన్నికలలో గెలిచారు. దీంతో మితవాదులు వేరే సంఘం పెట్టుకున్నారు. రావినారాయణరెడ్డి గెలిచిన తరువాత అనేకమంది సంఘంలో సభ్యులుగా చేరారు. అందులో ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, కమలాదేవి, బద్దం ఎల్లారెడ్డి సంఘంలో చేరి తమ భూములను పేదలకు పంచిపెట్టారు. 1934లో తెలంగాణ పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో చలసాని జగన్నాదరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు నాయకత్వన కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 1936 ఏప్రిల్‌ 11న అఖిల భారత కిసాన్‌సభ ఏర్పడి ”దున్నేవానికే భూమి” నినాదాన్ని ఇచ్చింది. 1939 డిసెంబర్‌ 13న తెలంగాణలో ముగ్ధుం మొహియిద్దీన్‌, అలంకుంద్‌ మీరి, ఇబ్రహిం, ముర్తుజా హైదర్‌, రాజ్‌బహుదూర్‌ గౌర్‌ నాయకత్వన ‘కామ్రేడ్స్‌ అసోసియేషన్‌’ ఏర్పడింది. ఈ అసోసియేషన్‌ తరువాత అనేక భూ పోరాటాలు సాగాయి. అనేక గ్రామాల్లో ”సంఘం” ఏర్పడి పనిచేసింది. ప్రభుత్వ భూము లతోపాటు భూస్వాముల భూములు అక్రమించిన ప్రజలలో ముఖ్యలు ఆరు పైసలు చెల్లించి సంఘ సభ్యత్వం పొందారు. ఈ సంఘానికి భీంరెడ్డి నర్సింహారెడ్డి తదితరులు కూడా నాయకత్వం వహించారు. 1941లో పెరవల్లి వెంకటరమణయ్య కార్యదర్శిగా, ఎ.గురవారెడ్డి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంక టేశ్వరరావు తదితరులు తెలంగాణ కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. కిసాన్‌ సభతోపాటు, ఆంధ్ర ప్రాంత కమ్యూనిస్టులు ఉద్యమానికి భౌతికంగా, ఆర్థికంగా సహకరించారు. ఈ పోరాటాన్ని అణచడానికి ఔరంగాబాద్‌కు చెందిన అడ్వకేట్‌ ఖాశీం రజ్వి నాయకత్వన 60వేల మంది కిరాయి సైనికులు, రజాకార్లు నిజాంకు తోడ్పాటు అందించారు.


ఐలమ్మ తిరుగుబాటు… దొడ్డి కొమరయ్య మరణం
జనగామ ప్రాంతంలోని పాలకుర్తి గ్రామంలో చాకలి ఐలమ్మ స్వంత భూమితోపాటు కౌలుకు భూమి తీసుకొని వరి పంట పండించింది. ఏపుగా పెరిగిన పంటను చూసిన జమీందారు విసునూరు రామచంద్రారెడ్డి పంటను ఎత్తుకెళ్ళడానికి గూండాలను పంపాడు. అప్పటికే ఆ గ్రామంలో ఉన్న భీంరెడ్డి నాయకత్వాన చల్ల ప్రతాపరెడ్డి, కె రాంచంద్రారెడ్డి, గంగుల సాయిరెడ్డి మరో 30మంది కలిసి గూండాలను తరిమివేసారు. ధాన్యం తీసుకెళ్ళకుండా అడ్డగించారు. దీనిని ఉత్సాహంగా భావించిన ప్రజలు ఊరేగింపు చేశారు. విసునూరు గ్రామ పరిసరాలలోకి రాగానే జమీందారు గుండాలు ఊరేగింపుపై కాల్పులు జరిపారు. ముందుపీఠిన ఉన్న దొడ్డి కొమురయ్య నెలకొరిగారు. ఈ మరణం పోరాటాన్ని ఉధృతంగా మలిచింది. ప్రజలు మరింత ఉద్రిక్తులై జమీందారు ఇంటిపై దాడి చేశారు. శవంతో ఊరేగింపు చేశారు. అప్పటినుండి రెండు మాసాలపాటు 300 గ్రామాలలో జమీందార్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. భూములు ఆక్రమించారు. నిజాం సైన్యాన్ని, రజాకార్లను, జమీందార్ల గుండాలను తరిమితరిమి కొట్టారు. ప్రజల నిరసన తీవ్రతను గమనించి కమ్యూనిస్టు పార్టీ, 11 సెప్టెంబర్‌ 1946న ‘సాయుధ పోరాటా’నికి పిలుపునిచ్చింది. నాటినుండి పోరాటం మరింత ఉధృతమైంది. హిందూ, ముస్లిం, దళిత, గిరిజన, వెనకబడిన రైతులు కలిసి జమీందార్లకు, నిజాంకు వ్యతిరేకంగా వర్గ పోరాటం ప్రారంభించారు. పోరాటం ప్రారంభమైన 11 మాసాలకు భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. నిజాం ప్రాంతానికి మాత్రం రాలేదు. స్వాతంత్య్రం అనంతరం కూడా 13 మాసాలపాటు పోరాటం సాగుతూనే ఉంది. 1500 మంది మరణించారు. ఈ పోరాటాన్ని నిజాం అణచలేదని భావించిన కేంద్రం 1948 సెప్టెంబర్‌ 13న సైన్యాలను పోరాట కేంద్రాలకు పంపింది. సైన్యాల రాకతో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి నైజాంను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. సెప్టెంబర్‌ 17న భారత పతాకాన్ని హైదరాబాద్‌లోని బొల్లారంలో సైన్యాధిపతి జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వాన ఆవిష్కరించారు. నిజాంను భారత ప్రభుత్వం ‘రాజ్‌ప్రముఖ్‌’గా ప్రకటించింది. రాజ్‌ప్రముఖ్‌ పదవికి ప్రజలు నిరసన తెలిపి నప్పటికి 1950 జనవరి 26 వరకు కొనసాగించారు. సైన్యం రాష్ట్రంలోనే ఉండి కమ్యూనిస్టులను అణిచివేయ డానికి వారిపై అత్యంత క్రూర హింసాకాండ సాగించాయి. తిరిగి జమీందార్లకు భూములు అప్పగించే ప్రయత్నం చేశాయి. ఈ పోరాటాన్ని అణిచివేయడం సాధ్యం కాదని భావించిన కేంద్ర నెహ్రూ ప్రభుత్వం, తెలంగాణలో ప్రజలు అక్రమించిన పది లక్షల ఎకరాల భూములకు ‘రక్షిత కౌలుదారీ చట్టం’ తెచ్చింది. భూముల నుండి తొలగించనని ప్రకటించింది. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడానికి కూడా వీలులేదు. ఈ చట్ట ప్రకటనతో 1951 అక్టోబర్‌ 21న ‘సాయుధ పోరాటాన్ని’ విరమిస్తూ కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. సైన్యంతో జరిగిన పోరాటంలో రెండు వేల ఐదు వందల మంది నాయకులు మరణించారు. మొత్తం నాలుగు వేల మంది అమరులయ్యారు. మూడు వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి.


సాయుధ పోరాటంపై వక్రభాష్యాలు
పోరాటం ప్రారంభమైనప్పటినుండీ హిందూ జమీందార్లకు, ముస్లిం నవాబుకు వ్యతిరేకంగా ముస్లింల నాయకత్వాన ఏర్పడిన కామ్రేడ్స్‌ అసోసియేషన్‌, కమ్యూనిస్టుపార్టీ, కిసాన్‌సభ నాయకత్వాన ప్రజలు ఐదు సంవత్సరాల ఒక మాసం సుదీర్ఘకాలం పోరాటం కొనసాగించారు. ఈ పోరాటంలో కుల, మతాలకు తావులేదు. రెండు పక్షాలలో హిందూ, ముస్లింలు ఉన్నారు. బందగి, షోయబుల్లా ఖాన్‌ (విలేకరి)తో సహా అనేకమంది ముస్లింలను చంపివేశారు. పోరాటంలో హిందూవులతో పాటు ముస్లింలు, మరాఠీలు కూడా పాల్గొన్నారు. అన్ని కులాలవారు ఒకే వేదికపై వచ్చి వర్గపోరాటం చేసి విజయం సాధించారు. ఈ పోరాటంలో ఒక కులం, మతం ఓటమి, మరో కులం, మతం గెలుపు అనేది లేదు. సాయుధ పోరాటం ముగిసిన 1951 అక్టోబర్‌ 21న బీజేపీ మాతృక అయిన ‘జన సంఘం’ ఏర్పడింది. ఈ పోరాటంతో జన సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. 1925 సెప్టెంబర్‌ 25న ఏర్పడిన ఆర్‌ఎస్‌ఎస్‌కు కూడా పోరాటంతో సంబంధం లేదు. అలాంటివారు నేడు విముక్తి ఉత్సవాలు జరుపుతామంటూ ప్రకటించడం నిరసించదగినది. ప్రజా వర్గ పోరాటానికి మతం రంగు పులిమి అపవిత్రం చేసే ప్రయత్నాలను ఖండించాలి. పోరాటం ఫలితంగా నైజాం ప్రజల కోరిక మేరకు భారతదేశంలో విలీనమైంది. జాతీయ కాంగ్రెస్‌ కూడా నైజాం ప్రభుత్వం కొనసాగడానికే అనుకూలంగా ఉన్నట్లు చరిత్ర చెపుతున్నది. సుశిక్షితులైన సైన్యాలతో జరిగిన పోరాటంలో ప్రజలు చేసిన పోరాటం మహత్తరమైంది. నాటి పోరాట నాయకులు తమ భూములను పేదలకు పంచి నాయకత్వం వహించారు. ఈ పోరాటాన్ని వక్రీకరించడం ద్వారా బీజేపీ తన కుటిలబుద్ధిని ప్రదర్శించుకుంటుంది. భారతదేశ చరిత్రనే మార్చాలని చేసే ప్రయత్నాల్లో ఇది ఒక భాగమే. ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెపుతారు.

సారంపల్లి మల్లారెడ్డి
9490098666

09/09/2023

పరస్పర బదిలీ అయిన వారి దరఖాస్తులు స్వీకరించాలి - హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

G. Ashok

 

 పరస్పర బదిలీ అయిన వారి దరఖాస్తులు స్వీకరించాలి -

 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు



 మ్యూచువల్ గ్రౌండ్లో ట్రాన్స్ఫర్స్ కి అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లు ప్రస్తుతానికి అనుమతించాలి అని పాఠశాల విద్యాశాఖ మరియు జిల్లా విద్యాధికారులు, ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఆదేశం..ఈ కేసు విషయంలో మళ్ళీ 11/9/2023 నాడు సోమవారం వాదనలు వింటామని HIGH COURT జస్టిస్ మాధవి గారి మధ్యంతరఉత్తర్వులు...

    మ్యూచువల్ పిటిషనర్ల లాయర్లు ప్రస్తుతానికి ప్రస్తుత పరిస్థితుల్లో కోరుతుంది ఏమిటంటే వారి యొక్క ఉమ్మడి జిల్లాల ఓల్డ్ స్టేషన్ల సీనియారిటీ కాకుండా, ప్రస్తుతానికి పనిచేస్తున్న నూతన పాఠశాల యొక్క సీనియారిటీని పరిగణించి, బదిలీలు ప్రమోషన్లు పూర్తయిన తర్వాత మిగిలిపోయిన ఖాళీలలో వారికి అవకాశం ఇవ్వాలని, అప్పుడు వారికి బదిలీల అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఇదే విషయాన్ని సోమవారం నాడు విచారిస్తాము..అందుకొరకే హైకోర్టు ప్రస్తుతానికి మ్యూచువల్ బదిలీల కోసం అప్లై చేసుకున్న వారి యొక్క ట్రాన్స్ఫర్ APPLICATIONS అనుమతించమని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది

    ఇక కేసు పూర్వాపరాలు చూస్తే మ్యూచువల్ బదిలీలలో వచ్చిన వారికి పాత స్టేషన్ పాయింట్లు ఇస్తూ ఈ బదిలీలలో అవకాశం కలిపించాలని లాయర్ పృథ్విరాజ్ గారు హైకోర్టులో పిటీషన్లు వేయడం జరిగింది.. అలాగే ఉమ్మడి జిల్లాలలో మ్యూచువల్ బదిలీలు జరిగిన వారికి పాత సీనియారిటీ అంటే సర్వీస్ సీనియారిటీ ఇవ్వాలి, సర్వీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని జీవో ఎంఎస్ 402 తేది. 19/2/2022 అదే చెబుతుంది. అని కోరడం జరిగింది.అయితే ఇదే జీవోను 11/4/2022 నాడు ఇచ్చిన తీర్పు WP నెంబర్ 16182 OF 2022 లో ఇచ్చిన తీర్పు ప్రకారం MUTUAL TRANSFERS SERVICE ప్రొటెక్షన్ జీవో 402 ను కొట్టివేయడం జరిగింది. దీనిని మేము పరిగణలోకి తీసుకుంటున్నామని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది..
.
    దీని ప్రకారమే మ్యూచువల్ పిటీషనర్ లాయర్ పృథ్వీరాజ్ గారు పైన తెలిపిన విధంగా మళ్ళీ కోరితే ఆ విషయాన్ని సోమవారం వాదనలు వింటామన్నారు ప్రస్తుతానికి MUTUAL TRANSFERS అప్లికేషన్లు అంగీకరించమని మాత్రమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

    గతంలో కోర్టు సస్పెండ్ చేసిన రద్దు చేసిన 402  సర్వీస్ ప్రొటెక్షన్ జీ ఓ ప్రకారము మ్యూచువల్ బదిలీలలో ఉమ్మడి జిల్లాలలో వచ్చినా కూడా సర్వీస్ ప్రొటెక్షన్ లేదు, ఇక ఇతర జిల్లాల మధ్య మ్యూచువల్ బదిలీ జరిగితే సర్వీస్ ప్రొటెక్షన్ ముచ్చట లేదు.. అలాగే స్పౌజ్ గ్రౌండ్లో అంతర జిల్లాల బదిలీలు జరిగిన సర్వీస్ ప్రొటెక్షన్ లేదు అని స్పష్టంగా తెలుస్తుంది.

ORDER

    In all these matters, the grievance of the petitioners is that their cases have not been considered for transfer counseling only on the ground that they have been transferred to their present respective Districts on request for mutual transfer.


    Learned counsel for the petitioners submitted that their seniority in the erstwhile Districts was to be considered vide G.O.Ms.No.402 dated 19.02.2022 and since the said G.O. was suspended by this Court vide order dated 11.04.2022 in W.P.No.16182 of 2022 and batch, the petitioners are seeking a direction to the respondents to consider their applications without considering their seniority in the erstwhile districts but only on basis of the seniority of the present place, where they are working and to be considered also only against the vacancies which are left over after the counseling is completed.


    Learned Government Pleader for Services-I seeks time to get instructions on this issue.

List these matters on 11.09.2023 in the Motion List.


    In the meanwhile, the respondents are directed to consider the applications which have been already filed by the petitioners herein


High Court Order Copy Download Here


G. Ashok. Rtd GHM. 9490300725.





06/09/2023

చరిత్ర వద్దు, పురాణాలే ముద్దు

G. Ashok

 చరిత్ర వద్దు, పురాణాలే ముద్దు
(తప్పనిసరిగా చదవాల్సిన ఒక విశ్లేషణ)

సింధూ నాగరికత

మన దేశానికి 'ఇండియా' పేరు ఈనాటిది కాదు.

ప్రపంచ చరిత్రకు సంబంధించి 'ఇండియా' Etymology ని పరిశీలిస్తే -


♦1. 'ఇండియా' పేరు Colonnial name (వలసవాదులైన పాశ్చాత్యులు, ఉదా: బ్రిటీష్) పెట్టారు) అంటున్నారు, అదెలా? ఎక్కడైనా ప్రపంచ లేదా ఇండియా చరిత్రలో వలసవాదులే మన దేశానికి 'ఇండియా' అని పేరు పెట్టారని ఉందా?

♦2. పురాణాల్లో ' భారత్ ' అని వాదిస్తున్నారు. పురాణాలు మనకు చారిత్రక పుస్తకాలా? పురాణ కథలకే చారిత్రక అంగీకారం లేదు. ఇక పురాణల్లోని పేర్లకు చరిత్ర ఉంటుందా? పురాణాల్లోని స్టోరీలను తీసుకెళ్ళి ప్రపంచ శాస్త్రీయ చరిత్రక టేబుల్ మీద పెట్టి మాట్లాడగలమా? మా పురాణాల్లో రాసివుందండి అన్జెప్పితే, నవ్విపోరా? చరిత్రకు పుక్కిటి పురాణాలకు తేడా లేదా?

♦3. క్రీ. పూ. 486 లో పర్షియా రాజైన డేరియస్ (దర్యావేషు) పలికిన మాటల్లో ఇండియా పేరు ' India' (Hindush) అని ఉందని Naksh - I - Rustam ఇరానియన్ చరిత్రకారుడు రాశాడు.

' భారత్ ' అని అప్పుడు లేదే?

♦4. క్రీ. పూ. 440 లో Herodotus అనే ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు - Eastward of India అని ప్రస్తావించి మన దేశం పేరు 'ఇండియా' అని రాశాడు.

' భారత్ ' అని అప్పుడు లేదే?

♦5. క్రీ. శ. 300 లో ప్రాచీన గ్రీక్ చరిత్రకారుడు మరియు ఇండియాకు వచ్చిన యాత్రికుడు మెగస్తనేస్ మన దేశం పేరు ' ఇండియా' అనే రాశాడు గానీ, భారత్ అని రాయలేదే! అంతేకాదు, తాను మన దేశం గురించి రాసిన పుస్తకానికి ' ఇండికా ' అని పేరు పెట్టాడే గాని, 'భారత్ కా' అని పెట్టలేదే!

♦6. క్రీ.శ. 140 లో గ్రీక్ చరిత్రకారుడు మరియు ఫిలాసఫర్ Arrian రాస్తూ మన దేశం పేరు: ఇండియా ' (" The boundary of the land of India...' అని రాస్తాడు.

' భారత్ ' అని రాయలేదే?

♦7. క్రీ. శ. 590 లో ఇస్లామిక్ భౌగోళికుడు ఇస్తాఖ్రి (Istakhri) మన దేశం గురించి ప్రస్తావిస్తూ 'హింద్' అని రాశాడు (" As for the land of the Hind..."). అలాగే, మన దేశానికి ఉన్న హద్దును ' Indian Ocean ' అని రాశాడు.

ఎక్కడా భారత్ అని లేదే?

♦8. క్రీ.శ. 650 లో పదహారేళ్లు ఇండియాలో పర్యటించిన ప్రపంచ ప్రసిద్ధ యాత్రికుడు, బౌద్ధ గ్రంథాలను తర్జుమా చేసిన చైనీస్ బౌద్ధ స్కాలర్ Xuanzang మన దేశ భౌగోళికత గురించి ప్రస్తావిస్తూ 'Five Indies' అని రాశాడు.

ఎక్కడెక్కడా ' భారత్ ' అని రాయలేదే!

♦9. క్రీ. శ. 944 లో ఇస్లామిక్ వేదాంతి మరియు చరిత్రకారుడు రాస్తూ - మన దేశానికి చెందిన ఒక ప్రాంతం పేరును సింద్ మరియు సింద్ అని పేర్కొన్నాడు. 

అక్కడెక్కడా ' భారత్ ' అని లేదే?

♦10. క్రీ. శ. 1298 లో ఆసియాను సందర్శించిన ఇటలీ వర్తకుడు, ప్రపంచ యాత్రికుడు మార్కోపోలో మన దేశం గురించి -  : ఇండియా ' ("India the Greater is that which....") అని రాశాడు.

భారత్ అని రాయలేదే!

♦11. క్రీ. శ. 1328 లో రోమన్ కాథలిక్ క్విలాన్ డయాసిస్ మొట్టమొదటి ఇండియన్ బిషప్ Jordanus రాస్తూ - మన దేశం పేరు ఇండియా అని పేర్కొన్నాడు ( "What shall I say? The greatness of India is beyond description....").

భారత్ అని రాయలేదే?

♦12. క్రీ. శ. 1404 లో ఇంగ్లాండ్ హెన్రీ III రాయబారి Clavijo మన దేశం గురించి ప్రస్తావిస్తూ - ఇండియా ( " India minor....") అని రాశాడు.

భారత్ అని లేదే?

♦13. క్రీ. పూ. నుండి క్రీ. శ. వరకూ అందుబాటులో ఉన్న ప్రపంచ చారిత్రక గ్రంథాలు, చరిత్రకారులను పరిశీలిస్తే వారు మన దేశాన్ని ' ఇండియా ' అనే పిలిచారు కాని, భారత్ అని కాదే. ఆరెస్సెస్ నేత మోహన్ భగవత్ ఏ ఆధారంతో ఈ దేశం మొదట్నుండీ ' భారత్ ' అని అంటారు? చరిత్ర శాస్త్ర కొలమానానికి అందని, వలస ఆర్యులు రాసుకున్న పిట్టకథల పురాణాల్లో కురువంశం అని వారు చెప్తున్న భరతుడు (చరిత్ర లేని) అని ఒక వ్యక్తి పేరు మీద 'భారత్ ' అని మన దేశానికి పేరు పెట్టడం సబబా? చారిత్రక నామమైన ఇండియా ను తీసేసి, ఏ చారిత్రక సమ్మతీ లేని ' భారత్ ' అని మార్చడంలో ఏం శాస్త్రీయ ఔచిత్యం ఉంది? 

♦14. భరతుడు రామాయణంలో ఆర్య బ్రాహ్మణ మనువాదులు సృష్టించిన ఒక కేరక్టర్. రామాయణానికే చరిత్ర లేనప్పుడు, అందులోని పాత్రలు పాత్రధారులకు ఏం చారిత్రకత ఆపాదించగలం మనం?

♦15. ఆర్యులు వచ్చేసరికి మన దేశానికి ఉన్న పేరు ఇండియా, వలసవాదులు వచ్చేసరికి మన దేశానికి ఉన్న పేరు ఇండియా. భారత్ ఎక్కడ నుండి వచ్చింది?

♦16. అవును. మనం రాసుకున్న రాజ్యాంగంలో ' India, that is Bharat' అని ఉంటే అర్థమేంటి? అందులో ఇండియా అని ముందు ఉందా? భారత్ అని ముందుందా? ' Bharat, that is India' అని లేదు కదా? రెంటికీ తేడా లేదా? వ్యాకరణాత్మకంగా భాషాపరంగా ఈ వాక్యంలో ఏ పేరుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది? ఇండియా కే కదా? మరి, మొదట్లో భారత్ అనే ఉండింది, బ్రిటీషోళ్లు దాన్ని ఇండియా గా మార్చారు అంటారేంటి? మన బీజేపీ నాయకులకు మతం తప్ప శాస్త్రీయ చరిత్ర తలకెక్కదా?

♦17. మన రాజ్యాగంలో మన దేశమైన ఇండియా కు అదనపు రెండవ పేరు గా 'భారత్' ను బ్రాహ్మణ భావజాలం ఉన్న సభ్యుల కారణంగా జొప్పించి ఉండొచ్చు. దాన్ని ఇంతవరకూ మనమెవరం ప్రశ్నించడం లేదు. మన దేశం పేరు ' ఇండియా ' అని ఉన్నంత కాలం, ఆ రెండవ పేరు ' భారత్ ' ను భాషావసరతను బట్టి (ఉదా. హిందీ లో మాట్లాడేటపుడు భారత్ అని రాస్తున్నాం, పలుకుతున్నాం కదా) ఉపయోగిస్తున్నాం కదా. ఇపుడు ఇప్పటికిప్పుడే ఇండియా అనే మన దేశ ప్రథమ పేరును రెండో స్థానానికి నెట్టేసి, రెండో స్థానంలో ఉన్న అదనపు పేరు భారత్ ను ముందుకు తీసుకురావడంలో బీజేపీ ఆంతర్యమేంటి? 

♦18. ఇంతకు ముందు బీజేపీ వాజ్ పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న మొత్తం 6 సంవత్సరాల 80 రోజుల్లో ఏనాడూ వారికి ఇండియా పేరు అభ్యంతరం కాలేదే!

కేవలం మోడీ ప్రధానిగా ఉన్న దాదాపు ఈ పదేళ్లలోనే ఈ అభ్యంతరం ఎందుకు లేవనెత్తుతున్నారు? మోడీ ఈ పదేళ్ల కాలంలో సరిగ్గా ఇప్పుడే, వాళ్ళ పాలన ముగింపులోనే ఈ ఆలోచన వారికెందుకు వచ్చింది? ఇది రాకెట్ సైన్స్ ప్రశ్న కానేకాదు. జవాబు చాలా విస్పష్టం. బీజేపీ ప్రతివాదులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకొన్న కూటమి పేరు - INDIA కాబట్టి (Indian National Developmental Inclusive Alliance). వాళ్ళు INDIA పేరును తెలివిగా హైజాక్ చేసేశారన్న నిస్సహాయతతో, ఇక చేసేదేం లేక, వీళ్ళు ఏకంగా దేశం పేరునే హైజాక్ చేసేస్తున్నారు. ఇది పొలిటికల్ పగ ప్రతీకారానికి చెందిన నిర్ణయమే గానీ, దీనికి ప్రజామోదం లేదు.

♦19. ఫిల్మ్ వెటరన్ అభిషేక్ బచ్చన్ ' భారత్ మాతా కీ జై ' అని ట్వీట్ చేస్తే అది ఆయన బీజేపీ కి పేరు మార్పుకి అనుమతి ఇచ్చేసినట్లా? ఆయనెవరు అలా చేయడానికి? అది కేవలం ఆయన అభిప్రాయం మాత్రమే. క్రికెట్ వెటరన్ సెహ్వాగ్ ఒప్పుకొంటే ఈ దేశం పేరు మార్పుకు జనాలందరూ ఒప్పేసుకొంటున్నట్లేనా? అది ఆయన ఒపీనియన్ మాత్రమే. బీజేపీ, దాని అనుబంధ చానళ్లకు వాళ్ళే దొరుకుతారా ఒపీనియన్ కోసం. మిగిలిన పార్టీల అభిప్రాయాలు, మిగిలిన మేధావుల అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు అవసరం లేదా? చోటా చోటా ప్రాంతీయ పార్టీలను కొనుక్కొనో, కలుపుకునో మెజారిటీ తెచ్చుకొన్నంత మాత్రాన; దేశ చరిత్రను తోసేసి, ప్రజల మనోభావాలను నొప్పించి జబర్దస్త్ గా మన చిరపరిచయ పేరు INDIA ను మార్చి రెండవ స్థాయిపేరుగా ఉన్న' భారత్ ' అని పిలవడం చాలా తీవ్రమైన నిర్ణయం అని భావించక తప్పదు.

♦20. అంతేకాదు, దేశంలో ప్రస్తుతం ఉన్న అనేక కీలక సమస్యలను విడిచిపెట్టి, ఊర్ల పేర్లు దేశం పేరు మార్చుకొంటూ పోవడం, పైగా ప్రతి విషయాన్నీ ఎక్కడో ఒకచోట సదరు పార్టీ మతంతో ముడిపెట్టి మెజారిటీ కార్డ్ ప్లే చేసుకొంటూ వెళితే గానీ నిద్రపోకపోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని ఇండియా ప్రజలకు ఎప్పుడో అర్ధమైపోయింది.


- మృత్యుంజయ, ఎల్. కె.

Link in English

https://www.worldhistory.org/article/203/etymology-of-the-name-india/

Our Team

  • Gaddam AshokManager/Editor in Chief
  • Dr Venu GopalMaster / Author
  • Syed Faizan AliMaster / Computers
  • Syed Faizan AliMaster / Computers
  • Syed Faizan AliMaster / Computers
  • Syed Faizan AliMaster / Computers