2025 జూలై 9 దేశవ్యాప్త సమ్మె డిమాండ్లు
1.
నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.
2.
పని హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. సమాన పనికి
- సమాన వేతనం అమలు చేయాలి. కనీస వేతనం నెలకు రూ.26,000/- లుగా నిర్ణయించాలి.
3.
ఔట్ సోర్స్, ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్ మెంట్, అప్రెంటిస్లు,
ట్రైనీలు వంటి రూపాలలో వివిధ పథకాల క్రింద పనిచేస్తున్న కార్మికులు ఎవరినీ క్యాజువలైస్
చేయరాదు.
4.
ఈపిఎస్ మరియు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో
ఉద్యోగ విరమణ చేసిన వారందరికి కనీస పెన్షన్ నెలకు రు. 13,000లు ఇవ్వాలి. దానికి
ఎప్పటికప్పుడు కరువు భత్యం జోడించాలి. అసంఘటిత
కార్మికులు మరియు వ్యవసాయ కార్మికులతో సహా అన్ని తరగతుల కార్మికులకు సామాజిక భద్రత
కల్పించాలి. పెన్షన్తో సహా సమగ్ర సామాజిక భద్రతలో అందరినీ భాగస్వాములను చేయాలి.
5.
పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలి. సిఎన్ఎస్
మరియు యుపిఎస్ ను రద్దు చేయాలి. పెన్షన్
సవరణ చట్టం 2025ని రద్దు చేయాలి.
6.
ఉద్యోగులకు,
పెన్షనర్లకు ఇప్పటికే వర్తిస్తున్న ఆరోగ్య సదుపాయాలను కుదించకుండా అవసరమైన మేరకు
మెరుగ్గా చేయాలి.
7.
దరఖాస్తు పెట్టినప్పటి నుండి 45 రోజుల వ్యవధిలో కార్మిక
సంఘాల తప్పనిసరి రిజిస్టర్ చేయబడాలి. ILO సమావేశాలు C87 మరియు C98 లను తక్షణమే ఆమోదించాలి.
8.
ధరల పెరుగుదలను నియంత్రించాలి. ఆహారం, మందులు, వ్యవసాయ-
పనిముట్లు, ఎరువులు మరియు యంత్రాలు వంటి ముఖ్యమైన వస్తువులపై జీఎస్టీని తొలగించాలి.
పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాస్ పై సెంట్రల్ ఎక్సైజ్ పన్నును గణనీయంగా తగ్గించాలి.
ఆహార భద్రత చట్టానికి హామీ ఇవ్వాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి.
9.
ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాల ప్రైవేటీకరణను
ఆపాలి. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ (MP) ను వెనక్కితీసుకోవాలి.
10. అన్ని
వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర @C-2+50% నిర్ధారించాలి. చట్టపరమైన హామీ ఇవ్వాలి.
విత్తనం, ఎరువులు మరియు విద్యుత్ మొదలైన వాటిపై రైతులకు ఇన్పుట్ సబ్సిడీని పెంచాలి.
11. విద్యుత్
(సవరణ) బిల్లు 2022ను ఉపసంహరించుకోవాలి. విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలి. ప్రీ-పెయిడ్
స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు.
12. ఉచిత
విద్యా హక్కు, ఉచిత ఆరోగ్య హక్కు, నీరు మరియు అందరికీ పారిశుధ్యం అందుబాటులోకి తేవాలి.
నూతన విద్యా విధానం (NEP) 2020ను రద్దు చేయాలి. అందరికీ గృహనిర్మాణం అమలు చేయాలి.
13. అటవీ
హక్కుల చట్టాన్ని (FRA) కఠినంగా అమలు చేయాలి.
14. వెల్ఫేర్
ఫండ్ లోకి వచ్చిన చందా నిధులతో నిర్మాణ కార్మికులకు ESI కవరేజ్ ఇవ్వాలి. ఆరోగ్య పథకాలకు
కవరేజ్, ప్రసూతి ప్రయోజనం, ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న కార్మికులందరికీ జీవిత
మరియు వైకల్యం బీమా ఇవ్వాలి.
15. అత్యధిక
సంపన్నుల పైన, కార్పొరేట్లపైన విధిస్తున్న పన్నును పెంచాలి. సంపద పన్ను మరియు వారసత్వ
పన్నును తిరిగి ప్రవేశపెట్టాలి.
16.
భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి హక్కు, మత స్వేచ్ఛ,
విభిన్న సంస్కృతులు, భాషలు, చట్టం ముందు సమానత్వం మరియు దేశ సమాఖ్య నిర్మాణం మొదలైన
రాజ్యాంగ ప్రాధమిక విలువలైన దాడిని ఆపాలి.
జి. అశోక్ 9490300725
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి