చరిత్ర వద్దు, పురాణాలే ముద్దు
(తప్పనిసరిగా చదవాల్సిన ఒక విశ్లేషణ)
మన దేశానికి 'ఇండియా' పేరు ఈనాటిది కాదు.
ప్రపంచ చరిత్రకు సంబంధించి 'ఇండియా' Etymology ని పరిశీలిస్తే -
♦1. 'ఇండియా' పేరు Colonnial name (వలసవాదులైన పాశ్చాత్యులు, ఉదా: బ్రిటీష్) పెట్టారు) అంటున్నారు, అదెలా? ఎక్కడైనా ప్రపంచ లేదా ఇండియా చరిత్రలో వలసవాదులే మన దేశానికి 'ఇండియా' అని పేరు పెట్టారని ఉందా?
♦2. పురాణాల్లో ' భారత్ ' అని వాదిస్తున్నారు. పురాణాలు మనకు చారిత్రక పుస్తకాలా? పురాణ కథలకే చారిత్రక అంగీకారం లేదు. ఇక పురాణల్లోని పేర్లకు చరిత్ర ఉంటుందా? పురాణాల్లోని స్టోరీలను తీసుకెళ్ళి ప్రపంచ శాస్త్రీయ చరిత్రక టేబుల్ మీద పెట్టి మాట్లాడగలమా? మా పురాణాల్లో రాసివుందండి అన్జెప్పితే, నవ్విపోరా? చరిత్రకు పుక్కిటి పురాణాలకు తేడా లేదా?
♦3. క్రీ. పూ. 486 లో పర్షియా రాజైన డేరియస్ (దర్యావేషు) పలికిన మాటల్లో ఇండియా పేరు ' India' (Hindush) అని ఉందని Naksh - I - Rustam ఇరానియన్ చరిత్రకారుడు రాశాడు.
' భారత్ ' అని అప్పుడు లేదే?
♦4. క్రీ. పూ. 440 లో Herodotus అనే ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు - Eastward of India అని ప్రస్తావించి మన దేశం పేరు 'ఇండియా' అని రాశాడు.
' భారత్ ' అని అప్పుడు లేదే?
♦5. క్రీ. శ. 300 లో ప్రాచీన గ్రీక్ చరిత్రకారుడు మరియు ఇండియాకు వచ్చిన యాత్రికుడు మెగస్తనేస్ మన దేశం పేరు ' ఇండియా' అనే రాశాడు గానీ, భారత్ అని రాయలేదే! అంతేకాదు, తాను మన దేశం గురించి రాసిన పుస్తకానికి ' ఇండికా ' అని పేరు పెట్టాడే గాని, 'భారత్ కా' అని పెట్టలేదే!
♦6. క్రీ.శ. 140 లో గ్రీక్ చరిత్రకారుడు మరియు ఫిలాసఫర్ Arrian రాస్తూ మన దేశం పేరు: ఇండియా ' (" The boundary of the land of India...' అని రాస్తాడు.
' భారత్ ' అని రాయలేదే?
♦7. క్రీ. శ. 590 లో ఇస్లామిక్ భౌగోళికుడు ఇస్తాఖ్రి (Istakhri) మన దేశం గురించి ప్రస్తావిస్తూ 'హింద్' అని రాశాడు (" As for the land of the Hind..."). అలాగే, మన దేశానికి ఉన్న హద్దును ' Indian Ocean ' అని రాశాడు.
ఎక్కడా భారత్ అని లేదే?
♦8. క్రీ.శ. 650 లో పదహారేళ్లు ఇండియాలో పర్యటించిన ప్రపంచ ప్రసిద్ధ యాత్రికుడు, బౌద్ధ గ్రంథాలను తర్జుమా చేసిన చైనీస్ బౌద్ధ స్కాలర్ Xuanzang మన దేశ భౌగోళికత గురించి ప్రస్తావిస్తూ 'Five Indies' అని రాశాడు.
ఎక్కడెక్కడా ' భారత్ ' అని రాయలేదే!
♦9. క్రీ. శ. 944 లో ఇస్లామిక్ వేదాంతి మరియు చరిత్రకారుడు రాస్తూ - మన దేశానికి చెందిన ఒక ప్రాంతం పేరును సింద్ మరియు సింద్ అని పేర్కొన్నాడు.
అక్కడెక్కడా ' భారత్ ' అని లేదే?
♦10. క్రీ. శ. 1298 లో ఆసియాను సందర్శించిన ఇటలీ వర్తకుడు, ప్రపంచ యాత్రికుడు మార్కోపోలో మన దేశం గురించి - : ఇండియా ' ("India the Greater is that which....") అని రాశాడు.
భారత్ అని రాయలేదే!
♦11. క్రీ. శ. 1328 లో రోమన్ కాథలిక్ క్విలాన్ డయాసిస్ మొట్టమొదటి ఇండియన్ బిషప్ Jordanus రాస్తూ - మన దేశం పేరు ఇండియా అని పేర్కొన్నాడు ( "What shall I say? The greatness of India is beyond description....").
భారత్ అని రాయలేదే?
♦12. క్రీ. శ. 1404 లో ఇంగ్లాండ్ హెన్రీ III రాయబారి Clavijo మన దేశం గురించి ప్రస్తావిస్తూ - ఇండియా ( " India minor....") అని రాశాడు.
భారత్ అని లేదే?
♦13. క్రీ. పూ. నుండి క్రీ. శ. వరకూ అందుబాటులో ఉన్న ప్రపంచ చారిత్రక గ్రంథాలు, చరిత్రకారులను పరిశీలిస్తే వారు మన దేశాన్ని ' ఇండియా ' అనే పిలిచారు కాని, భారత్ అని కాదే. ఆరెస్సెస్ నేత మోహన్ భగవత్ ఏ ఆధారంతో ఈ దేశం మొదట్నుండీ ' భారత్ ' అని అంటారు? చరిత్ర శాస్త్ర కొలమానానికి అందని, వలస ఆర్యులు రాసుకున్న పిట్టకథల పురాణాల్లో కురువంశం అని వారు చెప్తున్న భరతుడు (చరిత్ర లేని) అని ఒక వ్యక్తి పేరు మీద 'భారత్ ' అని మన దేశానికి పేరు పెట్టడం సబబా? చారిత్రక నామమైన ఇండియా ను తీసేసి, ఏ చారిత్రక సమ్మతీ లేని ' భారత్ ' అని మార్చడంలో ఏం శాస్త్రీయ ఔచిత్యం ఉంది?
♦14. భరతుడు రామాయణంలో ఆర్య బ్రాహ్మణ మనువాదులు సృష్టించిన ఒక కేరక్టర్. రామాయణానికే చరిత్ర లేనప్పుడు, అందులోని పాత్రలు పాత్రధారులకు ఏం చారిత్రకత ఆపాదించగలం మనం?
♦15. ఆర్యులు వచ్చేసరికి మన దేశానికి ఉన్న పేరు ఇండియా, వలసవాదులు వచ్చేసరికి మన దేశానికి ఉన్న పేరు ఇండియా. భారత్ ఎక్కడ నుండి వచ్చింది?
♦16. అవును. మనం రాసుకున్న రాజ్యాంగంలో ' India, that is Bharat' అని ఉంటే అర్థమేంటి? అందులో ఇండియా అని ముందు ఉందా? భారత్ అని ముందుందా? ' Bharat, that is India' అని లేదు కదా? రెంటికీ తేడా లేదా? వ్యాకరణాత్మకంగా భాషాపరంగా ఈ వాక్యంలో ఏ పేరుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది? ఇండియా కే కదా? మరి, మొదట్లో భారత్ అనే ఉండింది, బ్రిటీషోళ్లు దాన్ని ఇండియా గా మార్చారు అంటారేంటి? మన బీజేపీ నాయకులకు మతం తప్ప శాస్త్రీయ చరిత్ర తలకెక్కదా?
♦17. మన రాజ్యాగంలో మన దేశమైన ఇండియా కు అదనపు రెండవ పేరు గా 'భారత్' ను బ్రాహ్మణ భావజాలం ఉన్న సభ్యుల కారణంగా జొప్పించి ఉండొచ్చు. దాన్ని ఇంతవరకూ మనమెవరం ప్రశ్నించడం లేదు. మన దేశం పేరు ' ఇండియా ' అని ఉన్నంత కాలం, ఆ రెండవ పేరు ' భారత్ ' ను భాషావసరతను బట్టి (ఉదా. హిందీ లో మాట్లాడేటపుడు భారత్ అని రాస్తున్నాం, పలుకుతున్నాం కదా) ఉపయోగిస్తున్నాం కదా. ఇపుడు ఇప్పటికిప్పుడే ఇండియా అనే మన దేశ ప్రథమ పేరును రెండో స్థానానికి నెట్టేసి, రెండో స్థానంలో ఉన్న అదనపు పేరు భారత్ ను ముందుకు తీసుకురావడంలో బీజేపీ ఆంతర్యమేంటి?
♦18. ఇంతకు ముందు బీజేపీ వాజ్ పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న మొత్తం 6 సంవత్సరాల 80 రోజుల్లో ఏనాడూ వారికి ఇండియా పేరు అభ్యంతరం కాలేదే!
కేవలం మోడీ ప్రధానిగా ఉన్న దాదాపు ఈ పదేళ్లలోనే ఈ అభ్యంతరం ఎందుకు లేవనెత్తుతున్నారు? మోడీ ఈ పదేళ్ల కాలంలో సరిగ్గా ఇప్పుడే, వాళ్ళ పాలన ముగింపులోనే ఈ ఆలోచన వారికెందుకు వచ్చింది? ఇది రాకెట్ సైన్స్ ప్రశ్న కానేకాదు. జవాబు చాలా విస్పష్టం. బీజేపీ ప్రతివాదులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకొన్న కూటమి పేరు - INDIA కాబట్టి (Indian National Developmental Inclusive Alliance). వాళ్ళు INDIA పేరును తెలివిగా హైజాక్ చేసేశారన్న నిస్సహాయతతో, ఇక చేసేదేం లేక, వీళ్ళు ఏకంగా దేశం పేరునే హైజాక్ చేసేస్తున్నారు. ఇది పొలిటికల్ పగ ప్రతీకారానికి చెందిన నిర్ణయమే గానీ, దీనికి ప్రజామోదం లేదు.
♦19. ఫిల్మ్ వెటరన్ అభిషేక్ బచ్చన్ ' భారత్ మాతా కీ జై ' అని ట్వీట్ చేస్తే అది ఆయన బీజేపీ కి పేరు మార్పుకి అనుమతి ఇచ్చేసినట్లా? ఆయనెవరు అలా చేయడానికి? అది కేవలం ఆయన అభిప్రాయం మాత్రమే. క్రికెట్ వెటరన్ సెహ్వాగ్ ఒప్పుకొంటే ఈ దేశం పేరు మార్పుకు జనాలందరూ ఒప్పేసుకొంటున్నట్లేనా? అది ఆయన ఒపీనియన్ మాత్రమే. బీజేపీ, దాని అనుబంధ చానళ్లకు వాళ్ళే దొరుకుతారా ఒపీనియన్ కోసం. మిగిలిన పార్టీల అభిప్రాయాలు, మిగిలిన మేధావుల అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు అవసరం లేదా? చోటా చోటా ప్రాంతీయ పార్టీలను కొనుక్కొనో, కలుపుకునో మెజారిటీ తెచ్చుకొన్నంత మాత్రాన; దేశ చరిత్రను తోసేసి, ప్రజల మనోభావాలను నొప్పించి జబర్దస్త్ గా మన చిరపరిచయ పేరు INDIA ను మార్చి రెండవ స్థాయిపేరుగా ఉన్న' భారత్ ' అని పిలవడం చాలా తీవ్రమైన నిర్ణయం అని భావించక తప్పదు.
♦20. అంతేకాదు, దేశంలో ప్రస్తుతం ఉన్న అనేక కీలక సమస్యలను విడిచిపెట్టి, ఊర్ల పేర్లు దేశం పేరు మార్చుకొంటూ పోవడం, పైగా ప్రతి విషయాన్నీ ఎక్కడో ఒకచోట సదరు పార్టీ మతంతో ముడిపెట్టి మెజారిటీ కార్డ్ ప్లే చేసుకొంటూ వెళితే గానీ నిద్రపోకపోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని ఇండియా ప్రజలకు ఎప్పుడో అర్ధమైపోయింది.
- మృత్యుంజయ, ఎల్. కె.
https://www.worldhistory.org/article/203/etymology-of-the-name-india/
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి