23/06/2023

Enhancement of Allowances to Telangana State Govt Employees.

G. Ashok

 Enhancement of Allowances to Telangana State Govt Employees.


On the occasion of Telangana State Decennial Celebrations, the Government sanctioned the following allowances/benefits to employees of the State Government and Pensioners:

  1. Employees Traveling & Conveyance Allowances are enhanced by 30%
  2. Transport Allowance to the Employees under transfer is enhanced by 30%
  3. Drivers/Lift Operators will be paid Rs.150/- for attending Holiday Turn Duty
  4. Special Compensatory Allowance to the employees working in Scheduled Areas is enhanced by 30%
  5. Conveyance Allowance for Blind, Hearing Impaired and Physically Handicapped employees is enhanced from Rs.2,000/- to Rs.3,000/-
  6. Incentive to the employees working in all State Training Institutions is enhanced by 30%
  7. Special Pays to the Cops working in GreyHounds, Intelligence, Traffic, CID, OCTOPUS and Anti Naxalite Squad is continued on the Revised Pay Scales of 2020
  8. Death Relief in respect of Pensioners enhanced from Rs.20,000/- to Rs.30,000/-
  9. In addition 15% Spl pay is sanctioned to all the categories of employees working in the Protocol Department.
  10. The following advances to Employees are enhanced:
    1. Housing Building Advance limit enhanced from Rs.20.00 lakhs to Rs.30.00 lakhs
    2. Motor Car Advance limit enhanced from Rs.6.00 lakhs to Rs.9.00 lakhs
    3. Motor Cycle Advance limit enhanced from Rs.0.80 lakhs to 1.00 lakhs
    4. Marriage Advance for Female children enhanced from Rs.1.00 lakhs to Rs.4.00 lakhs and for Male Children from Rs.0.75 lakhs to Rs.3.00 lakhs.

  1. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పించనర్లకు శుభవార్త చెప్పింది. 
  2. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్ ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. 
  3. జీవోలో పేర్కొన్న దాని ప్రకారం, ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30శాతం పెంచింది. 
  4. బదిలీ పై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ 30శాతం పెంచింది. 
  5. సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డైవర్లకు అదనంగా రూ. 150 చెల్లించాలని నిర్ణయించింది. 
  6. షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30శాతం పెంచింది.
  7. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 పెంచింది. 
  8. ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ. 30లక్షలకు పెంచింది. 
  9. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 6లక్షల నుంచి 9 లక్షలకు పెంచింది. 
  10. మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ 80వేల నుంచి రూ. లక్షకు పెంచింది. 
  11. ఉద్యోగుల పిల్లల పెళిళ్ళకు సంబంధించి, కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ లక్ష నుంచి రూ. 4 లక్షలు, కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75వేల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది. 
  12. స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ 30శాతం పెంచింది. 
  13. గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ట్రాఫిక్, సీఐడి, ఆక్టోపస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేస్ ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపచేస్తారని పేర్కొంది. 
  14. పింఛనర్లు చనిపోతే అందించే తక్షణ సాయం రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచింది. 
  15. ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వర్తించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15శాతం స్పెషల్ పే మంజూరు చేసింది. 
  16. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విభాగాల వారీగా ఉత్వర్వులు జారీ చేసింది.

Enhancement of relief in case of death of Pensioners.

G. Ashok

Enhancement of relief in case of death of Pensioners.


               సర్వీసు పెన్షనర్ లేదా ఫామిలీ పెన్షనర్ మరణించినపుడు అంత్యక్రియల కొరకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకోసం గతంలో కనీసంగా రు. 20,000 లేదా ఒక నెల పెన్షన్ కుసమానం అయ్యే ఖర్చులు ప్రభుత్వం చెల్లించేది. తెలంగాణ మొదటి వేతన సవరణ కమిషన్ సూచనల మేరకు అట్టి ఖర్చులను కనీసంగా రు. 30,000 లకు పెంచుతూ ఉత్తర్వుG.O.Ms.No. 65, dt: 22.06.2023లను విడుదల చేసింది. 

               In the Government Order 6th read above, based on the recommendations of First Pay Revision Commission, orders were issued implementing the Revised Pay Scales, 2020 to the State Government employees.

                   The First Pay Revision Commission, inter alia, has recommended for enhancement of relief in case of death of Pensioners.        

Government, after careful consideration of the recommendations of the First Pay Revision Commission and in modification of the existing orders issued vide Government order 4th read above, hereby order for enhancement of the relief in case of death of Pensioners from Rs.20,000/- (Rupees twenty thousand only) to Rs.30,000/- (Rupees thirty thousand only).

             The Pension Disbursing Officers concerned shall arrange for payment of the amount to the nominee or where the nominee predeceased, to the alternative nominee, as far as possible, on the same day of the death of the Service Pensioner / Family Pensioner or on the next working day immediately following the day of the death of the Pensioner / Family Pensioner. 

              All other conditions and instructions issued in the references read above shall however continue to be in force.


ఉత్తర్వుల కాపీని ఇక్కడ G.O.Ms.No. 65, dt: 22.06.2023 క్లిక్  చేసి పొందవచ్చు 

30/04/2023

Regularization of Contract Employees

G. Ashok

 

Regularization of Contract Employees


    Telangana Govt has Issued Orders to Regularize 5544 Contract Personal working in various Departments on 30.04.2023 

GOVERNMENT OF TELANGANA

ABSTRACT




Public Services - Act 2 of 1994 Regularization of the services of Contract personnel- Orders Issued.



FINANCE (HRM.I) DEPARTMENT

G.O.Ms.No. 38     Dated: 30.04.2023

Read the following:-


G.O.Ms.No.16, Finance (HRM.I) Department, dt.26.02.2016.

***


ORDER:


Government after careful examination of the proposals received from the concerned administrative departments, hereby accord permission to the appointing authorities to appoint the following contract personnel on regular basis against the sanctioned posts, in terms of the orders issued in the reference read above, with effect from the date of issue of appointment orders.



19/04/2023

COVID తాజా ప్రశ్నలు - సమాధానాలు

G. Ashok

 COVID తాజా ప్రశ్నలు - సమాధానాలు

Dr. A. Venu Gopala Reddy

    COVID పై తాజా సమాచారం ఇవ్వమని అనేక మంది మిత్రులు నుండి ఫోన్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ, బూస్టర్ డోస్ వలే, పాత ముచ్చట్లే మళ్ళీ ఒకసారి కొత్తగా చెపుతున్నా...... COVID గూర్చి, కొందరు ఇంకా అతిగా ఆందోళన చెందుతున్నారు, అంత భయం అవసరం లేదు


    రెండు కరోనా తుపానులు చూశాం మనం, ఇప్పుడే వస్తున్న కరోనా కేసులు అప్పుడప్పుడు కురిసే వర్షాల వంటివి.....వర్షం అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది కదా😅


⭕ COVID ఇక ఎప్పటికీ పోదా?

✳️ COVID ఇక ఎప్పటికీ పోదు, మనతోటే ఉంటుంది....వస్తూ పోతూ వస్తూనే ఉంటది...సీజనల్ వ్యాధిగా మారింది అని చెప్పవచ్చు.


⭕ప్రస్తుతం వేవ్ వచ్చే అవకాశం ఉందా?

✳️ లేదు


⭕రెండో సారి కోవిడ్ వస్తె ఏమి చేయాలి?

✳️కొత్తగా ఏమి చేయాల్సిన అవసరం లేదు


⭕ Covid అనంతర గుండెపోటు కు నివారణ ఏమిటి?

✳️అనుమానం ఉన్నవారు, ఫుల్ బాడీ చెక్ up చేపించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలి


⭕ఇప్పుడున్న వాక్సిన్స్ కొత్త వేరియంట్ మీద పని చేస్తాయా?

✳️పని చేస్తాయి....కానీ అంత సమర్థవంతంగా కాదు


⭕కొత్త వాక్సిన్ వస్తుందా?

✳️ఇప్పట్లో అవకాశం లేదు


⭕ఇప్పటికే రెండు/ మూడు డోసులు తీసుకున్నవారు, ఇంకో డోసు తీసుకోవాలా?

✳️రిస్క్ ఉన్నవారు మూడో డోసు తీసుకోవాలి...నాలుగో డోసు ఎవరికీ అవసరం లేదు. మూడో డోసు గా కార్బోవాక్స్ తీసుకోవచ్చు. 


⭕గతంలో తీసుకున్న వాక్సిన్ ఇంకా పని చేస్తుందా, మన శరీరంలో? 


✳️వాక్సిన్ వల్ల పెరిగిన B CELL IMMUNITY ఉండకపోవచ్చు, కానీ, T CELL immunity దీర్ఘకాలికంగ పని చేస్తుంది.


⭕కొత్త వేరియంట్ పై పాత వాక్సిన్ ప్రభావం తక్కువ ఎందుకు?

✳️ Covid వైరస్ మిగిలిన వైరస్ ల వలెనే ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ, ఇమ్యూన్ సిస్టమ్ నుండి తప్పించుకునే వేషాలు వేస్తుంది.


⭕ప్రస్తుతం చిన్న పిల్లలపై కోవిడ్ ప్రభావం ఎంత?

✳️99% మంది పిల్లలలో COVID జలుబు లాంటి ప్రభావం మాత్రమే చూపిస్తుంది. లక్షణాలు ఎక్కువగా ఉంటే జాగ్రత్త పడాలి.


⭕కోవిడ్ కు కొత్త మందులు ఏమయినా వచ్చాయా?

✳️రాలేదు


⭕ కోవిడ్ పట్ల ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?

✳️😷😷😷😷😷


Dr. A. Venu Gopala Reddy

Principal

TS MODEL SCHOOL GHANMUKLA

VEENAVANKA

KARIMNAGAR DIST

9948106198


26/03/2023

Center Appointed Committee for Changes in NPS(CPS )

G. Ashok

 సిపియస్ విధానంలో మార్పుల కొరకు కేంద్ర కమిటీ

హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ ఘర్, పంజాబ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం  కొత్త పెన్షన్ విధానం( సిపియస్) విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని(ఓపియస్)ని పునరుద్దరించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పెన్షన్ విధానంలో మార్పులకు కమిటీని వేసింది.

పాత పెన్షన్ విధానం అంటే ట్రిపుల్ బెనిఫిట్ స్కీం. 1. ఉద్యోగి ఉద్యోగ విరమణ చేసేనాటి బేసిక్ పే లో సగం పెన్షన్ గా చెల్లిస్తారు. ఈ పెన్షన్ కూడా వేతన సవరణ జరిగినపుడల్లా పెన్షన్ ని కూడా సవరిస్తారు. ఈ విధానంలో ఉన్న ఉద్యోగుల నుండి ఉద్యోగం చేసినంత కాలం వేతనంలో 6శాతం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు జమచేసినట్లయితే దాని మీద వడ్డీతో సహా ఉద్యోగ విరమణ అనంతరం నగదుగా ఇస్తారు.  3. ఉద్యోగ విరమణ సమయంలోనే గ్రాట్యుటీ రూపంలో కొంత నగదుగా చెల్లిస్తారు. 

పాత పెన్షన్ విధానం 01.01.2004 దాకా ఉద్యోగులకు లాభసాటిగా ఉండేది. 2004లో అప్పటి బిజేపీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి 01.01.2004 తదుపరి ఉద్యోగంలో చేరే వారికి కొత్త పెన్షన్ విధనాన్ని ప్రకటించింది. ఈ కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు ప్రతి నెలా తమ వేతనం లో 10శాతం కాంట్రిబ్యూట్ చేస్తే, ప్రభుత్వం కూడా 10శాతం కాంట్రిబ్యూట్ చేసి ఆ మొత్తాన్ని షేర్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టి వచ్చిన లాభాల ద్వారా ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకు వచ్చింది. 

కేంద్రం తమ ఉద్యోగులకు కొత్త విధానాన్ని అమలు చేయడమే కాకుండా రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అమలు చేయడం మంచిదని సలహా ఇచ్చింది. ఆ తరువాత దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న బెంగాళ్, కేరళ, త్రిపుర రాష్ట్రాలలో తప్ప అన్ని రాష్ట్రాలు కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేసాయి. కేరళ, త్రిపురలలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాలు అధికారం కోల్పోయి ఇతర పార్టీలు అధికారం లోకి వచ్చిన తరువాత ఇదే విధానాన్ని అమలు చేసాయి. 

కొత్త పెన్షన్ విధానం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మాకు పాత విధానంలోనే పెన్షన్ చెల్లించాలని ఆందోళనలు మొదలైనాయి. అందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ ఘర్, పంజాబ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం  కొత్త పెన్షన్ విధానం(సిపియస్) విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని(ఓపియస్)ని పునరుద్దరించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విదంగా నిర్ణయం తీసుకోవడంతో కేంద్రానికి గుబులు మొదలైంది. పాత విధానంలోకి పోతే పోవచ్చు గాని ఇప్పటిదాకా ఈ స్కీంలో చెల్లించిన నిధులను మాత్రం తిరిగి ఇచ్చేది లేదు అంది. రిజర్వు బ్యాంకు కూడా ఒక ప్రకటన చేస్తూ పాత విధానం అమలు చేయడం రాష్ట్రాలకు తగని పని అంటూ అలా చేయడానిక ఆర్థిక వనరులు సరిపోవని హెచ్చరించింది.  అయినా ఇటీవల మహారాష్ట్రలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సందర్భంగా అక్కడి ప్రభుత్వం పాత పెన్షన్ లో మాదిరిగా ప్రయోజనాలు కలిగేవిధంగా కొత్త పెన్షన్ విధానంలో మార్పులకు ముందుకు వచ్చింది. ఉద్యోగులు తము చేసే 10శాతం కాంట్రిబ్యూషన్ కు ప్రభుత్వం ఇప్పటిదాక 14 శాతం కాంట్రిబ్యూట్ చేస్తూ వస్తున్న దానిని 20 శాతానికి పెంచుతామని  వాగ్దానం చేయాల్సి వచ్చింది. 

ఈ పూర్వరంగంలో కేంద్రం కూడా తప్పని సరి అయి ఏదోవిధంగా ఉద్యోగులను మంచి చేసుకోక తప్పదనే నిర్ణయానికి వచ్చి గతంలో ఈ కొత్త పెన్షన్ స్కీం అమలుకు ముందే ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలలోకి వచ్చిన వారికి వచ్చే ఆగష్టు 31 లోగా ఆప్షన్ ఇచ్చి పాత పెన్షన్ విధానంలోకి వెళ్లే విధంగా వెసులు బాటు కల్పించింది. అయినా ఉద్యోగుల ఆందోళనలు తగ్గలేదు సరికదా పెరిగాయి.  ఈ పరిస్థితుల్లో  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు గత శుక్రవారం రోజున ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి. సోమనాథన్ నేత్రుత్వంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ ప్రస్తుత కొత్త పెన్షన్ విధానంలో ఉద్యోగుల ఆశలు నెరవేరేలా ఎలాంటి మార్పులు చేయాలో సూచిస్తుంది.  

టివి సోమనాథన్ కమిటీ ఏం సూచనలు చేస్తుందో వేచి చూడాల్సిందే. అంతే తప్ప కేంద్రం సిపియస్ విధానాన్ని రద్దుచేసి ఓపియస్ విధానాన్ని అమలు చేయడానికి కమిటీ వేసిందని కొందరు చెబుతున్నది సరికాదు. ఇక పోతే టివి సోమనాథన్ కమిటీ కూడా చేసేది ఏమిటంటే ఆం.ప్ర. ప్రభుత్వం మాదరిగా జిపియస్ విధాన్నాన్ని ప్రతిపాదించ వచ్చు. ఏపీ ప్రభుత్వం  ప్రస్తుత సిపియస్ విధానంలోనే ఉద్యోగి చివరి నెల బేసిక్ పేలో 33శాతం పెన్షన్ ని గ్యారంటీ చేస్తాం అంది. అలాగే కాంట్రిబ్యూషన్ ని 14 శాతానికి పెంచడానికి ఒప్పుకుంటే పై 33 శాతాన్ని 40శాతానికి గ్యారంటీ చేస్తామనీ అంది. కాని, ఆ విధానాలు నచ్చక, అక్కడి ఉద్యోగులు ఆందోళన చేస్తూనే ఉన్న విషయమూ మనకు తెలిసిందే. 

కేంద్ర ప్రభుత్వం కూడా అదే మాదిరిగా ఉద్యోగుల ఆందోళనలను చల్లార్చే దాంట్లో భాగంగా మరింత ఉపశమనం ప్రకటించే అవకాశం మాత్రం ఉంది. అంతే తప్ప అసలు సిపియస్ విధానాన్ని రద్దు చేసి ఓపియస్ విధానం తెచ్చే ఆలోచన కేంద్రానికి ఉన్నట్లు లేదు. ఉద్యోగులు తమ ఆందోళనలను మరింత ఉద్రుతం చేసి తమ హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉంది. 

విచారించవలసిన అసలు విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో , వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్న ఆందోళన కూడా మన తెలంగాణ లో లేదు. బడా ఉద్యోగ సంఘ నేతలను తన చంకలో పెట్టుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసలు స్పందించే అవకాశం కూడా లేదు. యుఎస్ పిసి చొరవతో గత 2018లో ఏర్పడినట్లు ఏదైనా ఐక్య వేదిక ఏర్పడితే తప్ప ప్రయోజనం లేదు. మనం మేల్కోవాలి. మన మిత్రులను మేల్కొల్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది.

గడ్డం అశోక్

TAPRPA St Sec.



05/03/2023

అంతులేని దగ్గు - కారణాలు - చికిత్స - నివారణ

G. Ashok

 అంతులేని దగ్గు - ఏమిటి సంగతి


Dr. A. Venu Gopala Reddy

        ఇప్పుడు దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. మొన్న శివరాత్రి తరువాత నేను కూడా 4 రోజులు త్రీవ్ర దగ్గుతో బాధపడ్డా. ప్రజలు దగ్గుమందుల కోసం మెడికల్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. బాటిల్స్ కొద్ది దగ్గు మందు తాగిన దగ్గు తగ్గడం లేదంటున్నారు. 20-30రోజులు ఉంటుంది దగ్గు. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

        వీటన్నిటికీ కారణం H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్. శీతాకాలం నుండి ఎండాకాలం సీజన్ మారేటప్పుడు ఈ వైరస్ బాగా వ్యాప్తి చెందుతుంది. వాతావరణ కాలుష్యం కూడా కారణం.

లక్షణాలు

        జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, అలసట, వాంతులు, విరేచనాలు, శ్వాస కష్టంగా ఉండటం సాధారణంగా కనిపించే లక్షణాలు

చికిత్స

            మందులు వాడితే వారం రోజుల్లో వాడకుంటే ఏడు రోజుల్లో తగ్గే జబ్బు ఇది (మళ్ళీ చదవండి). ఇది వైరల్ వ్యాధి కాబట్టి అంటి బయోటిక్స్ వాడొద్దు సాధారణ మందులు పారాసెటమాల్, దగ్గు మందు, జలుబు మందులతో తగ్గిపోతుంది.

        బాగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, జావా, పండ్ల రసాలు, తేనె, గోరు వెచ్చటి నీరు తీసుకోవాలి. విశ్రాంతి చాలా అవసరం. గృహ చిట్కాలు బాగా పనిచేస్తాయి. గొంతు GARGLING చేయాలి.

            శ్వాసలో బాగా ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ నీ సంప్రదించాలి

నివారణ

1. సామూహిక ప్రాంతాలకు దూరంగా ఉండాలి

2. మాస్క్ వాడాలి

3. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి


DR.A. VENU GOPALA REDDY, PhD in Microbiology

Principal, TS MODEL SCHOOL, GHANMUKLA, KARIMNAGAR 9948106198