11/08/2023

ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

G. Ashok

 ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ



  • ‘పాత పెన్షన్ స్కీమ్’ పునరుద్ధరించండి…

  • ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

  • భారత్ బంద్ సహా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరిక

            పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గురువారం 10.08.2023న, రాంలీలా మైదానంలో ‘పెన్షన్ హక్కుల మహా ర్యాలీ’ ర్యాలీ నిర్వహించారు.


ఇక్కడ క్లిక్ చేసి ర్యాలీ వీడియో చూడండి. (News Click సౌజన్యంతో)

        దాదాపు 60 సంఘాల వేదికగా జాయింట్‌ ఫోరమ్‌ ఫర్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌) నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం, ప్రస్తుత జాతీయ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌)ని జనవరి 1, 2004న లేదా ఆ తర్వాత రిక్రూట్ చేయబడిన ఉద్యోగులకు అమలు చేయడం వివక్షతో కూడుకున్నదనీ, ఇది ‘‘వాడుకుని వదిలివేయడం‘‘ వంటిదనీ ప్రధాన మంత్రి గారికి మెమోరాండం సమర్పించారు.


        OPS కింద, ఉద్యోగులు చివరిగా తీసుకున్న ప్రాథమిక వేతనంలో 50% నేరుగా పెన్షన్‌గా ఇవ్వబడిందని మరియు దానిపై ద్రవ్యోల్బణం ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్‌ను చెల్లిస్తారనీ మెమోరాండం పేర్కొంది. "NPSలో, అటువంటి నిర్వచించబడిన మరియు హామీ ఇవ్వబడిన పెన్షన్ లేదు, అది నిర్వచించబడిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ మాత్రమే. ఇది పూర్తి వివక్ష మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 16ను ఉల్లంఘించడమే అన్నారు. ఎందుకంటే నియామక తేదీ ఆధారంగా, ప్రభుత్వ ఉద్యోగులను రెండు తరగతులుగా విభజించారు, ఒక సమూహం నిర్వచించబడింది మరియు 50%కి సమానమైన పెన్షన్‌ను హామీ ఇస్తుంది. వారి చివరి వేతనం ఎటువంటి సహకారం లేకుండా తీసుకోబడింది, అయితే ఇతర సమూహం తక్కువ పెన్షన్‌ను పొందుతోంది, ఇది మార్కెట్ యొక్క మార్పులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరికీ ”ఓపిఎస్‌ను పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోవాలని మోదీని మెమోరాండం కోరింది.



‘పెన్షన్ హక్కుల మహా ర్యాలీ’లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, మాజీ పారా మిలటరీ ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంలీలా మైదానంలో ఎన్.జె.సి.ఏ కన్వీనర్ శివగోపాల్ మిశ్రా అధ్యక్షతన బహిరంగసభ జరిపారు. జాయింట్ ఫోరం ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జేఎఫ్ఆర్ఓపీఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలు, ర్యాలీలలో లక్షలాది మంది రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఇన్కమ్ టాక్స్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వ, స్వయంప్రతిపత్త సంస్థల ఉద్యోగులు, టీచర్లు, యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్లు పాల్గొని న్యూ పెన్షన్ స్కీము(సిపియస్)ను రద్దు చేయాలని నినదించారు. ఎన్పీఎస్ కారణంగా ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితంగా మారినందు వల్ల ఓపీఎస్‌ ను పునరుద్ధరించమనడం న్యాయబద్ధమైన కోర్కె తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం అశోక్ ఈ సందర్భంగా తెలిపారు.


        సి.ఆర్.పి.ఎఫ్, సి.ఐ.ఎస్.ఎఫ్, ఐ.టి.బి.పి, యస్.యస్.బి, ఎన్.ఎస్.జి, అస్సాం రైఫిల్స్, తదితర సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సి.ఎ.పి.ఎఫ్ లు) సిబ్బంది అందరూ పాత పెన్షన్‌ స్కీముకు అర్హులని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ఓపీఎస్‌ అమలు చేయడానికి తిరస్కరించటం శోచనీయమని పేర్కొన్నారు. ఎన్.పీ.ఎస్ కు అనుకూలంగా కొద్దిమంది ఆర్థికవేత్తలు చేస్తున్న వాదనలు పూర్తిగా అసంబద్ధమన్నారు. అనేక దేశాల్లో పెన్షన్ నిధులు కుప్పకూలాయని, పెన్షనర్లు నష్టపోయారని, భారతదేశంలో కూడా ఎన్.పీ.ఎస్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, షేర్ మార్కెట్ పతనమైతే పెన్షన్ ఫండ్ దివాళా తీస్తుందని గడ్డం అశోక్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాసంపదను కార్పొరేట్లకు దోచి పెడుతూ, సామాజిక రంగానికి, వృద్ధాప్య భద్రతపై కోతలు విధిస్తున్నదని, పెన్షన్ ఫండ్లను ప్రైవేటీకరిస్తున్నదని తెలిపారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పీ.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకే కాకుండా దేశానికి కూడా చాలా ఉపయోగకరమన్నారు. ఎన్. పీ.ఎస్ పై కేంద్రం వేసిన కమిటీపై భ్రమలు అవసరం లేదని, వృద్ధాప్య భద్రతను కాపాడేందుకు, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికై ఐక్యంగా భారత్ బంద్ తో సహా ఆందోళనలను వెంటనే తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా గడ్డం అశోక్ హెచ్చరించారు.


గడ్డం అశోక్

9490300725






09/08/2023

Restoration of Old Pension Scheme: Burden on States? Truth!

G. Ashok

ఓపీఎస్‌ పునరుద్ధరణ: రాష్ట్రాలపై భారమా? నిజమెంత!    


        బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయాన్ని ధిక్కరించి, నూతన పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేసి తమ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని తిరిగి అమలు చేస్తామని ప్రచారాన్ని మొదలుపెట్టాయి. న్యూ పెన్షన్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఊపందుకున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్‌ స్కీము నుండి పాత పెన్షన్‌ విధానానికి మారడానికి నిర్ణయాలు చేసి అమలు కూడా చేస్తున్నాయి. నూతన పెన్షన్‌ స్కీమ్‌ అంగీకారయోగ్యం కాదని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధ రించాలని రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోని బీజేపీయేతర పార్టీ ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. ఈ పార్టీలు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని, ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో వాగ్దానాలు చేసి ప్రస్తుతం అమలు కోసం ప్రకటించాయి. కేంద్రం మాత్రం నూతన పెన్షన్‌ విధానం అమలుకు తన నిబద్ధతను తెలియజేస్తూ పార్లమెంటులో ప్రకటించింది. పాత పెన్షన్‌ విధానానికి తిరిగి రివర్షన్‌కు ఎంచుకునే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తాయని కేంద్ర ప్రభుత్వ అనుకూల ఆర్ధిక వేత్తలు, అనుకూల ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రచారం చేస్తున్నవి. అంతేకాక, ఉద్యోగుల ఓట్లు సంపాదించుకోడానికి ఆయా పార్టీలు ఎంచుకున్న ఎత్తుగడగా కూడా అభివర్ణిస్తున్నవి.

పాత పెన్షన్‌ విధానం కింద సభ్యులుగా వున్నవారు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు చెందిన రెగ్యులర్‌ ఉద్యోగులు 2004కు ముందు సర్వీసులో వున్నప్పుడు ఎటువంటి తన వాటా షేర్‌ను చెల్లించకుండానే పదవీ విరమణ తదుపరి, చివరగా తీసుకున్న వేతనంలో సగానికి సగం పెన్షన్‌ పొందుతారు. దీనిని నిర్దిష్ట పెన్షన్‌ ప్రయోజన పథకం అంటారు. అంతేకాక, పదవీ విరమణ తదుపరి, ఆ కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్తుంది. పదవీ విరమణ తరువాత, ధరల పెరుగుదలకు అనుగుణంగా కరువు భత్యం రిలీఫ్‌ను, పెన్షన్‌పై నిష్పత్తిగా చెల్లి స్తారు. ఇదే విధంగా సర్వీసులో ఉన్నప్పుడు కూడా కరువు భత్యం పేరుతో మూల వేతనంపై నిష్పత్తిగా ఇస్తారు. ప్రజలకు సేవ అందించే ఉద్యోగులకు విరమణ తరువాత వారి సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే అవసరమైన నిర్వచించబడిన నిర్దిష్టమైన ప్రయోజనం సమకూర్చు పథకం అని అర్ధం. నూతన పెన్షన్‌ బిల్లు పథకం రూపకల్పన అంటే, పథకం ప్రయోజనాలను అందించే సంస్థల పెన్షన్‌ బిల్లు, ఉద్యోగుల వేతనాల నుండి 10శాతం వాటా నిధులను ప్రభుత్వం తరపు నుంచి 14శాతం వాటా నిధులను సమకూరుస్తుంది.ఈ నూతన పెన్షన్‌ పథకాన్ని అమలుచేయుటకు అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, భారతదేశంలోనే కాకుండా, అనేక ఇతర దేశాలలోనూ ఇలాంటి పథకాలు అమలులో వున్నాయి.

ప్రజలకు సేవలందించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా, ఇతర సంస్థలలో 20 లేదా అంతకంటే ఎక్కువ మంది. కార్మికులు పనిచేసే సంస్థలలో తప్పనిసరిగా పదవీ విరమణ పొదుపు పథకం వర్తిస్తుంది. అటువంటి సంస్థలలో ఉద్యోగి అతని లేక ఆమె జీతంలో 10 శాతం వాటాను ఈ పథకానికి అందించ వలసి వుంటుంది. ఈ పథకానికి యజమాని నుండి కూడా సహ కారం అందించబడుతుంది. ఈ సేకరించబడిన సొమ్ము మొత్తాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థచే నిర్వహించబడుతుంది. పదవీ విరమణ తరువాత, ఉద్యోగి ఏకమొత్తం చెల్లింపునకు అర్హులు. మిగిలిన భాగాన్ని యాన్యుటీ చెల్లింపు పథకాలలో పెట్టు బడి పెట్టగా వచ్చిన దానిని పెన్షన్‌గా చెల్లిస్తారు. అనేకమంది కార్మికులు చిన్న అనధికారిక, ప్రయివేటురంగ యూని ట్లలో లేదా స్వయం ఉపాధి పొందుతున్న చాలామంది. కార్మికులు కూడా ఈ పథకం నుండి దూరంగా వున్నా రంటే ఆశ్చర్యం కాదు. వారు ఇకపై పని చేయలేనప్పుడు, పొదుపు చేయడానికి. తగినంత సంపాదించలేని వారికి అందించడానికి అధికారిక సామాజిక రక్షణ పథకాలలో కొన్ని అధికారికంగా నిర్వచించబడిన దారిద్య్రరేఖకు దిగువన వున్న వారికి కంట్రిబ్యూషన్‌ లేకుండానే పెన్షన్‌ను చెల్లిస్తున్నారు. ఈ పథకంలో పెన్షన్‌ రూపంలో చెల్లించేది. చాలా అల్పమయినదే.

ప్రస్తుత వైరుధ్యం పాత పెన్షన్‌ పథకాన్ని తిరిగి అమలు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పథకాలకు సంబంధించినది. పాత పెన్షన్‌ పథకాన్ని రద్దుచేసి, నూతన పెన్షన్‌ పథకంతో భర్తీ చేయాలనే నిర్ణయం, పాత పెన్షన్‌ పథకం ఆర్ధికంగా నిలకడగా లేనందున సమర్ధించబడుతోంది అనే వాదన కూడా వుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీవితకాలం పెరగడం, ధరల పెరుగుదల ఆధారంగా హామీ ఇవ్వబడిన కరువు భత్యంతో పెన్షన్‌లో పెరుగుదల ఫలితంగా, ప్రతి వ్యక్తి పెన్షన్‌ సొమ్ము పెరిగింది. కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్‌ బిల్లులో పెరుగుదల ఏర్పడింది. మరొకవైపు ఆదాయాలు తగినంతగా పెరగడం లేదు. కారణం ఆర్ధికలోటు జిడిపిలో రుణాల స్థాయి పెరగకుండా ఉండాలంటే, సామాజికంగా వ్యయంతో (పెన్షన్‌ తదితర వ్యయాలు) సహా ఇతర వ్యయాలను తగ్గించవలసి వుంటుంది. ఈ వాదన రెండు స్పష్టమైన ప్రశ్నలకు దారితీస్తుంది. ముందుగా పెన్షన్‌ బిల్లులో పెరుగుదలకనుగుణంగా ఆదాయాలు ఎందుకు లేవు? రెండవది లోటు, రుణం స్థాయిని ఏది నిర్ణయిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి భిన్నంగా వున్నాయి..

కేంద్రం విషయానికొస్తే, నయా ఉదారవాద విధానాల అమలు వల్ల ఆర్ధికంగా పతనం చెంది ఆదాయ వృద్ధి లేకుండా వుంది. ఇది అభివృద్ధికి దారి తీస్తుందని అంచనా వేసి ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించబడానికి కేంద్ర ప్రభుత్వం అవలంభించిన పన్ను విధానమే! ఉదాహరణకు 2019-20లో లాభ దాయకమైన సంస్థలపై పన్ను రేటు కేవలం 22.5 శాతం ఉందని ఒక సర్వే చెబుతోంది. అయితే కేవలం రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వున్న కంపెనీలకు అవసరమైన చట్టబద్ధమైన రేటు (మినహాయింపులు, రాయితీలు లేకుండా) 34 శాతంగా వుంది. నయా ఉదారవాదం అంటే, ఆర్ధిక మూలధనాన్ని తగ్గించాల్సిన అవసరం వున్నందున, ద్రవ్య లోటును తప్పనిసరిగా పూడ్చాలి. ఈ లోటు, ఆర్ధిక వ్యయం రాష్ట్ర ప్రయోజనాలకు హాని కరంగా పరిగణిచింది. తద్వారా మొత్తం వ్యయం పెరుగుదలపై పరిమితిని నిర్దేశి స్తుంది. ఈ పరిమితి, పెన్షన్‌ బిల్లు పెరిగే రేటు కంటే తగ్గితే, పన్ను రాబడిని పెంచాలి. లేదా ఇతర ఖర్చులను తగ్గించవలసి వుంటుంది. ప్రయివేటు లాభదాయకతను ప్రోత్సహించే నయా ఉదారవాద నిబద్ధత కారణంగా పన్నురాబడిలో పెరుగుదల విస్మరించబడింది. కాబట్టి సర్దు బాటును నిర్ధారించడానికి, ఖర్చులను తగ్గించాల్సి వుంటుంది. కాని వారసత్వంగా వచ్చిన వ్యయకట్టుబాట్లను బట్టి ఆర్ధిక సంక్షోభ ఫలితంగా కేంద్రం స్వచ్ఛందంగా కార్పొరేట్‌ రంగానికి, పన్ను రాయితీలను అందించి, దాని ఆర్ధికలోటును నియంత్రించడానికి ఎంచుకున్నట్టే, 2004లో స్వచ్ఛందంగా, పాత పెన్షన్‌ విధానాన్ని ఉపసంహరణను ఎంచుకుంది.

నయా ఉదారవాదం, ఆర్ధికంగా రాష్ట్రాలు బలహీనపడటం, సంక్షోభానికి కారణమని వాస్తవ పరిస్థితి నుండి దష్టిని మరల్చడానికి పాత పెన్షన్‌ పథకాన్ని వదిలివేయబడుతున్న సంక్షోభానికి ప్రతిస్పందనగా, కేంద్ర ప్రభుత్వం మరియు నయా ఉదారవాదం న్యాయ నిర్ణేతలు నూతన పెన్షన్‌ పథకంను విజయ వంతమైన పరిష్కారంగా నిర్వచించారు. నూతన పెన్షన్‌ పథకం కింద 2004 తరువాత ఉద్యోగంలో నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనంలో 10శాతం వాటాను నిధికి విరాళంగా అందిస్తారు. ప్రభుత్వం 14శాతం వాటాను నిధికి సహకారాన్ని అందిస్తుంది. పేరుకుపోయిన మొత్తాలను స్వతంత్ర పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్లు వారి సేవలకు చెల్లించే నిధులతో పెట్టుబడి పెడతారు, ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు వారు కార్పస్‌ ఫండ్‌లో గరిష్టంగా 60శాతం మొత్తాన్ని తీసుకొని మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ స్కీమ్‌లో పెట్టుబడి పెడతారు. దాని నుండి వచ్చే రాబడి నుండి పెన్షన్‌ చెల్లిస్తారు. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి, కాని ఇతర ప్రయివేటురంగ యజమానులు వారి ఉద్యోగులు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు.

పెన్షన్‌ అందించే కార్పస్‌ ఫండ్‌ను రూపొందించడంలో ఉద్యోగి, సహకరిస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికే వాటాను అందజేసే, వృత్తిపరమైన ఫండ్‌ మేనేజరుల ద్వారా ఆ నిధుల నిర్వహణ, ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో తరువాత పొందిన మొత్తాలను సమీకరించింది. కానీ ఫండ్‌ మేనేజరు ద్వారా కార్పస్‌ ఫండ్‌ ఎంత బాగా నిర్వహించబడుతుందనే దానిపై పెన్షన్‌ చెల్లింపు ఆధారపడి వుంటుంది. 2008 ఆర్ధిక సంక్షోభం సమయంలో అమెరికన్‌ పెన్షనర్లకు జరిగినట్లుగా మార్కెట్‌ ఆశించిన రాబడిని అందించక పోవచ్చు లేదా కుప్పకూలడం సంభవించినప్పుడు పొదుపులో ఎక్కువ భాగాన్ని కూడా తుడిచివేయవచ్చు. అంతేకాకుండా, ఎలాంటి ఫలితం వచ్చినా రుసుమును స్వీకరించే ప్రొఫెషనల్‌ ఫండు మేనేజరు. ఊహించనంత తెలివిగా ఉండక పోవచ్చు. ఈ స్కీము గ్యారంటీ లేనిది. బెనిఫిట్‌ లేనిది. నిర్వచించబడిన సహకారం లేదు. ఈ నష్టాలు ముఖ్యమైనవి. ఇది పాత పెన్షన్‌ పథకం కంటే నూతన పెన్షన్‌ పథకం వలన చాలా తక్కువ ఫలితం ఉంటుంది. అని అనేక ఉదాహరణలను ఉటంకించవచ్చు.

ఉద్యోగులు, కార్మికులు పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణకు చేసే ఉద్యమంతో పాటు కేంద్ర ప్రభుత్వం, వారి అనుకూల మీడియా వారి ఆర్ధికవేత్తలు చేసే తప్పుడు వాదనలో (అనగా పాత పెన్షన్‌ విధానం అమలు వల్ల ప్రభుత్వాలు అధిక ఆర్ధిక భారాలు మోస్తున్నవి అనే వాదనలు) ఎంత మాత్రం వాస్తవం లేదని ప్రచార యుద్ధాన్ని కూడా జతచేసి పోరాటం నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. అంతేగాక పాత పెన్షన్‌ పునరుద్ధరణ ఉద్యమంలో ఐక్యతను పటిష్టంగా నిర్మాణం చేసి దేశవ్యాపిత ఐక్య పోరాటాలకు కృషిచేయాలి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో విడివిడిగా జరుగుతున్న పోరాటాలు దేశవ్యాప్త పోరాటాలుగా రూపాంతరం చెందే విధంగా కృషి చేసి విజయం సాధించేవరకూ పోరాడాలి. అదే కార్మికవర్గం ముందున్న ప్రస్తుత, ప్రధాన కర్తవ్యం కావాలి.


 
ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్‌ 
 9490300867



నవ తెలంగాణ, దినపత్రిక 09-08-2023 సౌజన్యంతో

02/08/2023

ITR Filling - Upto 200% Penality on Fake Receipts

G. Ashok

 
ఆదాయ పన్ను సరిగా చెల్లించకపోతె 200శాతం పెనాల్టీ.

గడ్డం అశోక్,

            ఆదాయపన్ను ఆక్ట్ నిబంధనల ప్రకారం పన్ను నిబంధనలన ప్రకారం చెల్లించకుండా తప్పించుకోవడానికి తప్పు పద్దతులను పాటించేవారిపై తీవ్రమైన చర్యలకు ఆదాయపన్ను శాఖ సిద్ధమవుతోంది. దానిలో భాగంగా చెల్లించని పన్ను పై 200శాతం దాకా పెనాల్టీ విధించడమే కాకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితులలో జైలు పాలయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆదాయపన్ను రిటర్నులు పూర్తి చేయడానికి విధించిన సమయం జులై 31 తో ముగిసినందున సమర్పించబడిన రిటర్నులను క్షున్నంగా పరిశీలించే పనిలో ఆదాయపన్ను శాఖ బిజీగా ఉంది.

        ఆదాయపన్ను చట్టం పన్ను మదింపు సమయంలో కొన్ని రాయితీలు కల్పించింది. ముఖ్యంగా ఇంటి అద్దె అలవెన్స్, వివిధ సంస్థలకు ఇచ్చిన విరాళాలు విషయాలలో రాయితీలు ఉన్నాయి. పన్ను మదింపు సమయంలో పన్ను చెల్లించేవారు ఫేక్ అద్దె రశీదులు సమర్పించి పన్ను రాయితీని పొందుతున్నారు. వివిధ సంస్థలకు విరాళాల రూపంలో ఇచ్చిన అని చెబుతున్న రశీదులను సమర్పించమని నోటీసులు పంపడానికి సిద్దమవుతున్నారు. రశీదులు సమర్పించకున్నా, సమర్పించిన రశీదులు నఖిలీవని తెలిసినా సెక్షన్ 270ఏ ప్రకారం 200శాతం దాకా పెనాల్టీ (అపరాధ రుసుము) విధించే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో చట్ట ప్రకారం విచారణ కూడా ఎదుర్కోవలసి ఉంటుందనీ, జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంటుందని దివాకర్ విజయసారథి, ఢివిఎస్ అద్వైజర్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివాకర్ విజయసారథి తెలిపారు.  


 


20/07/2023

చంద్లయాన్ - 3 హెచ్ఈసీ ఇంజనీర్లు, సిబిబంధికి వేతనాలు వెంటనే చెల్లించాలి.

G. Ashok

 చంద్రయాన్‌ -3 హెచ్‌ఈసీ ఇంజినీర్లు,సిబ్బందికి 18 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి.


    చంద్రయాన్‌ -3 లాంచ్‌ప్యాడ్‌ను సిద్ధం చేసిన జార్ఘండ్‌లోని రాంచీలో ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఈసీ) ఇంజినీర్లు, ఇతర సిబ్బందికి గత 18 నెలల నుంచి జీతాలు ఇవ్వక పోవడాన్ని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్ తప్పు పట్టారు. ఐదేళ్లుగా కీలకమైన సీఎండీ పదవి ఖాళీగా ఉండటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని, దాదాపు రూ.1500 కోట్ల విలువైన ఆర్డర్లు ఇస్రో, రక్షణశాఖ, రైల్వే, కోల్‌ ఇండియా నుంచి వచ్చినప్పటికీ నిధుల కొరత కారణంగా 80 శాతం పనులు హెచ్‌ఈసీలో నిలిచిపోవడం బాధాకరమని అన్నారు. హెచ్‌ఈసీ ఉద్యోగుల, ఆఫీసర్ల సంఘాలు పునరుద్ధరణకు ప్రాధాన్యతనిస్తూ ఆధునీకరణ ప్రతిపాదనలు సమర్పించి వర్కింగ్ క్యాపిటల్ రూ.1000 కోట్లు సమకూర్చాలని ఎన్నోసార్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖను కోరినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2023- 24 సంవత్సరానికి బడ్జెటరీ సపోర్ట్ గా కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే కేటాయించడాన్ని 321వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విమర్శించిందని పేర్కొన్నారు.

    జాబిల్లిపై పరిశోధనల కోసం, భారత రోదసీ యాత్రలో మరో ముందడుగు వేసేందుకు ల్యాండర్‌ను ప్రయోగించడంతో మనదేశం చంద్రునిపై అడుగుపెట్టే దేశాలలో ప్రపంచంలో అమెరికా, సోవియట్‌ యూనియన్‌(రష్యా), చైనా తరువాత ఇండియా నాలుగో స్థానంలో నిలవబోతుందని, ఇంతటి అద్బుత విజయం వెనుక ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, ఇతర కార్మికుల శ్రమ ఎంతో ఉందని,18 నెలలుగా జీతాలు లేకున్నా ఇంజినీర్లు, ఇతర సిబ్బంది చంద్రయాన్‌ -3 కోసం పనిచేశారని తెలిపారు. దేశం సాధించబోయే విజయం కోసం అన్నిటిని దిగమింగుకుని రేయనకా, పగలనకా పనిచేశారని, వారి బాధలను పట్టించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమయాన్ని కేటాయించక పోవడం దుర్మార్గమని, ఎన్నోమార్లు వేతనాల కోసం ఇంజినీర్లు,సిబ్బంది అర్జీలు పెట్టుకున్నా కనికరించలేదని వాపోయారు.

    ఇప్పటివరకు ఏ దేశం వెళ్లని చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం ఇస్రో చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని చేపట్టిందని, జీతాల చెల్లింపుల్లో సమస్య ఉన్నా లాంచ్‌ప్యాడ్‌ సహా ఇతర కీలక సామాగ్రిని గడువుకు ముందే హెచ్‌ఈసీ 2022 డిసెంబర్‌లోనే ఇస్రోకు అందజేసిందని పేర్కొన్నారు.

    చంద్రయాన్‌-2 ప్రయోగం ద్వారా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడదామని అహోరాత్రులు శ్రమించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది వేతనాల్లోనూ ప్రభుత్వం కోత పెట్టిందని,ఇస్రో ప్రయోగానికి ముందు ఒక్కొక్కరికి పదివేల రూపాయల వేతనాన్ని కట్‌ చేసి  శాస్త్రవేత్తల్లో ఆనందాన్ని లేకుండా చేసిందని తెలిపారు.

   ప్రయోగ కేంద్రాలను, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను అదాని లాంటి ఆశ్రిత పెట్టుబడుదారులకు అప్పజెప్పేందుకే ప్రభుత్వం ఆధునీకరణకు నిధులు కేటాయించటం లేదని తెలిపారు.

    సైన్సుపరంగా చేసే ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇచ్చే 392 సైన్సు అవార్డులను ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసిందని, ఉపయోగం లేని వాటికి కోట్ల రూపాయలు కట్టబెడుతూ దేశానికి పనికొచ్చే రంగాలకు నిధులివ్వడం లేదంటే దేశం పయనం ఏ దిశగా పోతుందో అర్థం చేసుకోవచ్చునని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని, అదే విధంగా స్వయం శక్తితో ఎదిగేందుకు ఇస్రోకు యావత్‌ జాతి మద్దతు కొనసాగాలని, శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది కృషికి ప్రోత్సాహము ఉండాలని వి.కృష్ణ మోహన్ విజ్ఞప్తి చేశారు.


V. Krishna Mohan

National Vice Chairman,

Confederation of Central Government Gazetted Officers Organisations 

(CCGGOO) kmdrdo@gmail.com 

Secretary, All Pensioners & Retired Persons Association 9440668281

23/06/2023

Enhancement of Allowances to Telangana State Govt Employees.

G. Ashok

 Enhancement of Allowances to Telangana State Govt Employees.


On the occasion of Telangana State Decennial Celebrations, the Government sanctioned the following allowances/benefits to employees of the State Government and Pensioners:

  1. Employees Traveling & Conveyance Allowances are enhanced by 30%
  2. Transport Allowance to the Employees under transfer is enhanced by 30%
  3. Drivers/Lift Operators will be paid Rs.150/- for attending Holiday Turn Duty
  4. Special Compensatory Allowance to the employees working in Scheduled Areas is enhanced by 30%
  5. Conveyance Allowance for Blind, Hearing Impaired and Physically Handicapped employees is enhanced from Rs.2,000/- to Rs.3,000/-
  6. Incentive to the employees working in all State Training Institutions is enhanced by 30%
  7. Special Pays to the Cops working in GreyHounds, Intelligence, Traffic, CID, OCTOPUS and Anti Naxalite Squad is continued on the Revised Pay Scales of 2020
  8. Death Relief in respect of Pensioners enhanced from Rs.20,000/- to Rs.30,000/-
  9. In addition 15% Spl pay is sanctioned to all the categories of employees working in the Protocol Department.
  10. The following advances to Employees are enhanced:
    1. Housing Building Advance limit enhanced from Rs.20.00 lakhs to Rs.30.00 lakhs
    2. Motor Car Advance limit enhanced from Rs.6.00 lakhs to Rs.9.00 lakhs
    3. Motor Cycle Advance limit enhanced from Rs.0.80 lakhs to 1.00 lakhs
    4. Marriage Advance for Female children enhanced from Rs.1.00 lakhs to Rs.4.00 lakhs and for Male Children from Rs.0.75 lakhs to Rs.3.00 lakhs.

  1. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పించనర్లకు శుభవార్త చెప్పింది. 
  2. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్ ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. 
  3. జీవోలో పేర్కొన్న దాని ప్రకారం, ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30శాతం పెంచింది. 
  4. బదిలీ పై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ 30శాతం పెంచింది. 
  5. సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డైవర్లకు అదనంగా రూ. 150 చెల్లించాలని నిర్ణయించింది. 
  6. షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30శాతం పెంచింది.
  7. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 పెంచింది. 
  8. ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ. 30లక్షలకు పెంచింది. 
  9. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 6లక్షల నుంచి 9 లక్షలకు పెంచింది. 
  10. మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ 80వేల నుంచి రూ. లక్షకు పెంచింది. 
  11. ఉద్యోగుల పిల్లల పెళిళ్ళకు సంబంధించి, కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ లక్ష నుంచి రూ. 4 లక్షలు, కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75వేల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది. 
  12. స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ 30శాతం పెంచింది. 
  13. గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ట్రాఫిక్, సీఐడి, ఆక్టోపస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేస్ ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపచేస్తారని పేర్కొంది. 
  14. పింఛనర్లు చనిపోతే అందించే తక్షణ సాయం రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచింది. 
  15. ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వర్తించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15శాతం స్పెషల్ పే మంజూరు చేసింది. 
  16. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విభాగాల వారీగా ఉత్వర్వులు జారీ చేసింది.

Enhancement of relief in case of death of Pensioners.

G. Ashok

Enhancement of relief in case of death of Pensioners.


               సర్వీసు పెన్షనర్ లేదా ఫామిలీ పెన్షనర్ మరణించినపుడు అంత్యక్రియల కొరకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకోసం గతంలో కనీసంగా రు. 20,000 లేదా ఒక నెల పెన్షన్ కుసమానం అయ్యే ఖర్చులు ప్రభుత్వం చెల్లించేది. తెలంగాణ మొదటి వేతన సవరణ కమిషన్ సూచనల మేరకు అట్టి ఖర్చులను కనీసంగా రు. 30,000 లకు పెంచుతూ ఉత్తర్వుG.O.Ms.No. 65, dt: 22.06.2023లను విడుదల చేసింది. 

               In the Government Order 6th read above, based on the recommendations of First Pay Revision Commission, orders were issued implementing the Revised Pay Scales, 2020 to the State Government employees.

                   The First Pay Revision Commission, inter alia, has recommended for enhancement of relief in case of death of Pensioners.        

Government, after careful consideration of the recommendations of the First Pay Revision Commission and in modification of the existing orders issued vide Government order 4th read above, hereby order for enhancement of the relief in case of death of Pensioners from Rs.20,000/- (Rupees twenty thousand only) to Rs.30,000/- (Rupees thirty thousand only).

             The Pension Disbursing Officers concerned shall arrange for payment of the amount to the nominee or where the nominee predeceased, to the alternative nominee, as far as possible, on the same day of the death of the Service Pensioner / Family Pensioner or on the next working day immediately following the day of the death of the Pensioner / Family Pensioner. 

              All other conditions and instructions issued in the references read above shall however continue to be in force.


ఉత్తర్వుల కాపీని ఇక్కడ G.O.Ms.No. 65, dt: 22.06.2023 క్లిక్  చేసి పొందవచ్చు